చాట్‌వాలా: రూ.1.2 కోట్లు స్వాధీనం చేసుకొన్న ఐటీ అధికారులు

By narsimha lodeFirst Published Oct 19, 2018, 3:53 PM IST
Highlights

చాట్ బండిని నడుపుతున్న జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తి ఇంట్లో  రూ.1.2 కోట్ల విలువైన నగదును ఆదాయపు పన్ను శాఖాధికారులు స్వాధీనం చేసుకొన్నారు


పటియాలా: చాట్ బండిని నడుపుతున్న జీవనం సాగిస్తున్న ఓ వ్యక్తి ఇంట్లో  రూ.1.2 కోట్ల విలువైన నగదును ఆదాయపు పన్ను శాఖాధికారులు స్వాధీనం చేసుకొన్నారు. బుధవారం నాడు  ఆదాయపు పన్ను శాఖాధికారులు నిర్వహించిన దాడుల్లో  ఈ విషయం వెలుగు చూసింది.

రెండేళ్లుగా చాట్ వాలా ఐటీ రిటర్న్స్ దాకలు చేయడం లేదు.  దీంతో అతని వద్ద  రూ.1.2 కోట్ల నిల్వలున్నాయని అధికారులు అభిప్రాయపడ్డారు. పంజాబ్ రాష్ట్రంలోని పటియాలలో చాట్ బండిని నడిపే ఇతడికి... పలు చోట్ల  చాట్ వ్యాపారాలు ఉన్నట్టు ఐటీ అధికారులు గుర్తించారు. 

ఇతనికి ఉన్న  వ్యాపారాల గురించి  ఆరా తీస్తున్న క్రమంలోనే రియల్ ఏస్టేట్‌లోనూ  అతను లక్షల్లో పెట్టుబడులు పెట్టినట్టుగా ఐటీ అధికారులు గుర్తించారు. తమ దాడుల్లో  ఎక్కువగా చిరు వ్యాపారుల నుండే ఎక్కువ మొత్తంలో డబ్బులను స్వాధీనం చేసుకొన్నట్టుగా ఐటీ అధికారులు ప్రకటించారు. 


 

click me!