UP Election 2022: యూపీలో కొన‌సాగుతున్న ఆరో ద‌శ ఎన్నిక‌ల పోలింగ్.. ఓటేసిన సీఎం యోగి !

Published : Mar 03, 2022, 10:25 AM IST
UP Election 2022: యూపీలో కొన‌సాగుతున్న ఆరో ద‌శ ఎన్నిక‌ల పోలింగ్.. ఓటేసిన సీఎం యోగి !

సారాంశం

UP Assembly Election 2022: ఉత్త‌రప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఆరోద‌శ పోలింగ్ గురువారం ప్రారంభ‌మైంది. ఉదయం 9 గంటల వరకు 8.69 శాతం పోలింగ్‌ నమోదైంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్‌లోని ప్రాథమిక పాఠశాల గోరఖ్‌నాథ్ కన్యానగర్ లో త‌న ఓటును వినియోగించుకున్నారు.   

UP Assembly Election 2022: ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాజ‌కీయాలు ర‌స‌వ‌త్త‌రంగా మారాయి. ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో ఇప్ప‌టికే ప‌లు ద‌శల‌ ఎన్నిక‌లు పూర్త‌యిన క్ర‌మంలో రాజ‌కీయ పార్టీలు ప్రచారాన్ని ముమ్మ‌రంగా కొన‌సాగిస్తున్నాయి. విమ‌ర్శ‌లు, ఆరోప‌ణ‌లతో విరుచుకుప‌డుతుండ‌టంతో రాజకీయాలు కాక రేపుతున్నాయి. రాష్ట్రం (Uttar Pradesh) లో మ‌ళ్లీ అధికారం ద‌క్కించుకోవాల‌ని బీజేపీ గ‌ట్టిగా ప్ర‌య‌త్నాలు చేస్తుండ‌గా, మాజీ ముఖ్య‌మంత్రి అఖిలేష్ యాద‌వ్ (Akhilesh Yadav) నేతృత్వంలోని స‌మాజ్ వాదీ పార్టీ సైతం త‌న‌దైన స్టైల్ లో ప్ర‌చారం కొన‌సాగిస్తూ.. అధికార పీఠం ద‌క్కించుకోవాల‌ని చూస్తోంది. కాంగ్రెస్‌, బీఎస్పీలు సైతం గ‌ట్టిపోటీగా ముందుకు సాగుతున్నాయి. 

ఇలాంటి ప‌రిస్థితులు కొన‌సాగుతున్న త‌రుణంలోనే ఉత్త‌ర‌ప్ర‌దేశ్ అసెంబ్లీ ఎన్నిక‌ల ఆరోద‌శ పోలింగ్ గురువారం ప్రారంభ‌మైంది. ఉత్తరప్రదేశ్‌లోని 10 జిల్లాల్లోని 57 నియోజకవర్గాల్లో 6వ దశ అసెంబ్లీ ఎన్నికలకు గురువారం 7 గంట‌ల‌కు ఓటింగ్ ప్రారంభ‌మైంది. ఉదయం 9 గంటల వరకు 8.69 శాతం పోలింగ్‌ నమోదైంది. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ గోరఖ్‌పూర్‌లోని ప్రాథమిక పాఠశాల గోరఖ్‌నాథ్ కన్యానగర్ లో త‌న ఓటును వినియోగించుకున్నారు. ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, కాంగ్రెస్‌కు చెందిన అజయ్ కుమార్ లల్లూ, సమాజ్‌వాదీ పార్టీకి చెందిన స్వామి ప్రసాద్ మౌర్య వంటి భారీ నాయకుల భవితవ్యాన్ని ఓట‌ర్లు నిర్ణ‌యించ‌నున్నారు. కీల‌క‌మైన అంబేద్కర్‌నగర్, బలరాంపూర్, సిద్ధార్థనగర్, బస్తీ, సంత్ కబీర్ నగర్, మహరాజ్‌గంజ్, గోరఖ్‌పూర్, ఖుషీనగర్, డియోరియా, బల్లియా జిల్లాల్లో ఆరో ద‌శ పోలింగ్ జ‌రుగుతోంది. మొత్తం 57 స్థానాల కోసం 676 మంది అభ్య‌ర్థులు పోటీ ప‌డుతున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యానాథ్ మొద‌టిసారి అసెంబ్లీ ఎన్నిక‌ల‌ బ‌రిలో నిలిచిన గోరఖ్‌పూర్ అర్బన్ నియోగ‌జ‌క‌వ‌ర్గానికి కూడా నేడు ఓటింగ్ జ‌రుగుతోంది. అలాగే, రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు లల్లూ తమ్‌కుహి రాజ్ స్థానం బ‌రిలోకి దిగ‌గా, ఇటీవ‌లే మంత్రిప‌ద‌వికి రాజీనామా చేసి.. బీజేపీ గుడ్‌బై చెప్పి స‌మాజ్ వాదీ పార్టీలో చేరిన స్వామి ప్రసాద్ మౌర్య ఫాజిల్‌నగర్ నుంచి బ‌రిలోకి దిగారు. 

ప్ర‌స్తుతం ఓటింగ్ జ‌రుతున్న స్థానాల్లో కతేహరి, తాండా, అలాపూర్ (SC), జలాల్‌పూర్, అక్బర్‌పూర్, తులసిపూర్, గైన్‌సారి, ఉత్రౌలా, బల్రాంపూర్ (SC), షోహ్రత్‌గఢ్, కపిల్వాస్తు (SC), బంసీ, ఇత్వా, దోమరియాగంజ్, హరయ్య, కప్తంగంజ్, రుధౌలీ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. , బస్తీ సదర్, మహదేవ (SC), మెన్హదావల్, ఖలీలాబాద్, ధన్‌ఘట (SC), ఫారెండా, నౌతన్వా, సిస్వా, మహారాజ్‌గంజ్ (SC), పనియ్రా, కైంపియర్‌గంజ్, పిప్రైచ్, గోరఖ్‌పూర్ అర్బన్, గోరఖ్‌పూర్ రూరల్, సహజన్వా, ఖజానీ (SC), చౌరి- చౌరా, బన్స్‌గావ్ (SC), చిల్లుపర్, ఖద్దా, పద్రౌనా, తమ్‌కుహి రాజ్, ఫాజిల్‌నగర్, కుషీనగర్, హటా, రాంకోలా (SC), రుద్రపూర్, పథార్‌దేవా, రాంపూర్ కార్ఖానా, భట్‌పర్ రాణి, సేలంపూర్ (SC), బర్హాజ్, బెల్తారా రోడ్, రాస్రా, సికందర్‌పూర్ , ఫెఫ్నా, బల్లియా నగర్, బన్స్దిహ్, బైరియాలు ఉన్నాయి.  మొత్తం 2,14,62,816 మంది ఓటర్లు ఉండ‌గా, వారిలో 1,14,63,113 మంది పురుషులు, 99,98,383 మంది మహిళలు, 1,320 మంది థర్డ్ జెండర్లు ఉన్నారు. 

 

 

 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

West Bengal Rail Revolution: రైల్వే విప్లవానికి కీలక కేంద్రంగా వెస్ట్ బెంగాల్ | Asianet Telugu
PM Modi flags off Vande Bharat sleeper: పట్టాలపై పరుగులు పెట్టిన వందే భారత్ స్లీపర్| Asianet Telugu