ఢిల్లీలో అమృత్ పాల్ సింగ్ ? తలపాగా లేకుండా, మాస్క్ పెట్టుకొని కనిపించిన సీసీటీవీ పుటేజీ వెలుగులోకి..

By Asianet NewsFirst Published Mar 29, 2023, 6:50 AM IST
Highlights

ఢిల్లీ వీధుల్లో అమృత్ పాల్ సింగ్ నడుస్తూ కనిపించిన వీడియో ఒకటి వెలుగులోకి వచ్చింది. అందులో అతడు తలపాగా లేకుండా, మాస్క్ పెట్టుకొని ఉన్నాడు. అతడి వెనకాలే సహాయకుడు పాపల్‌ప్రీత్ సింగ్ కూడా ఉన్నాడు. 

ఖలిస్థాన్ అనుకూల మత బోధకుడు అమృత్పాల్ సింగ్ తలపాగా లేకుండా, మాస్క్ ధరించిన మరో సీసీటీవీ ఫుటేజీ మంగళవారం వెలుగులోకి వచ్చింది. మార్చి 21న ఢిల్లీలోని ఓ మార్కెట్ నుంచి వచ్చిన ఈ వీడియోలో ‘వారిస్ పంజాబ్ దే’ చీఫ్ నల్లటి కళ్లద్దాలు ధరించి వీధిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఆయన ముఖ్య అనుచరుడు పాపల్‌ప్రీత్ సింగ్ కూడా బ్యాగ్ తో నడుస్తూ కనిపించాడు. అయితే ఈ వీడియోలో కనిపిస్తున్నది అమృత్ పాల్, అతడి సహాయకుడేనా ? కాదా ? అనే కోణంలో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

కేంద్రప్రభుత్వం సంచలన నిర్ణయం.. 18 ఫార్మా కంపెనీల లైసెన్సులు రద్దు

ఈ విషయంలో ఇప్పటి వరకు తమకు అలాంటి సమాచారం లేదని, వీడియో చిత్రీకరించిన ప్రదేశం ఢిల్లీదేనని నిర్ధారించామని ఓ పోలీసు అధికారి తెలిపినట్టు వార్తా సంస్థ ‘పీటీఐ’ తెలిపింది. అయితే తాజా ఫుటేజీపై పంజాబ్ పోలీసుల నుంచి ఎలాంటి అధికారిక సమాచారమూ లేదు.

| 'Waris Punjab De' chief Amritpal Singh, who's on the run, was spotted without a turban and with a mask on his face in Delhi on March 21.

(Visuals confirmed by police) pic.twitter.com/3YhMtnRgp5

— ANI (@ANI)

మార్చి 18వ తేదీన రాడికల్ బోధకుడిపై, ఆయన సంస్థ 'వారిస్ పంజాబ్ దే'పై పోలీసుల అణచివేత ప్రారంభమైనప్పటి నుంచి ఆయన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో దర్శనమివ్వడం గమనార్హం.  అయితే అమృత్ పాల్ సింగ్ జలంధర్ లో జరిగిన దాడుల నుంచి తప్పించుకుని పలుమార్లు వాహనాలు, తన రూపాన్ని మార్చుకుని పరారయ్యాడు.

దేశ రాజధానిలో విషాదం.. లిఫ్ట్ లో నలిగి తొమ్మిదేళ్ల బాలుడి దుర్మరణం..

ఇదిలా ఉండగా.. అమృత్ పాల్ సింగ్ ను పట్టుకునేందుకు తాము పలు ఏజెన్సీలతో సమన్వయం చేసుకుంటున్నామని భగవంత్ మాన్ నేతృత్వంలోని ప్రభుత్వం పంజాబ్, హర్యానా హైకోర్టుకు తెలిపింది. అమృత్ పాల్ సింగ్ పోలీసుల అక్రమ కస్టడీలో ఉన్నారంటూ న్యాయవాది ఇమాన్ సింగ్ ఖారా దాఖలు చేసిన హెబియస్ కార్పస్ పిటిషన్ పై పంజాబ్, హర్యానా హైకోర్టు విచారణ జరిపింది. తదుపరి విచారణను మార్చి 29కి వాయిదా వేసింది. పోలీసుల అణచివేత నుంచి అమృత్ పాల్ సింగ్ తప్పించుకోవంలో ఇంటెలిజెన్స్ వైఫల్యంపై మార్చి 21న కోర్టు పంజాబ్ ప్రభుత్వాన్ని తప్పుబట్టింది. 

ఆన్‌లైన్ బెట్టింగ్‌కు పాల్పడిన ఫిన్‌టెక్.. 150 బ్యాంకు ఖాతాల్లోని రూ.3 కోట్లు సీజ్

అరెస్టయిన వ్యక్తిని విడిపించేందుకు అమృత్ పాల్ సింగ్, ఆయన మద్దతుదారులు అమృత్ సర్ సమీపంలోని అజ్నాలా పోలీస్ స్టేషన్ ను ముట్టడించడంతో వారిపై పోలీసుల అణచివేత ప్రారంభమైంది. ఈ ఘటనలో ఆరుగురు పోలీసులు గాయపడ్డారు. అప్పటి నుంచి పంజాబ్ పోలీసులు రాడికల్ బోధకుడి సహచరులను అసమ్మతి వ్యాప్తి, హత్యాయత్నం, దాడి, పోలీసు సిబ్బంది, ప్రభుత్వ ఉద్యోగుల విధులకు అడ్డంకులు సృష్టించడం వంటి క్రిమినల్ కేసుల కింద అరెస్టు చేశారు. 

click me!