అర్థరాత్రి మహిళపై కానిస్టేబుల్ అత్యాచార యత్నం..!

Published : Jul 17, 2021, 11:30 AM ISTUpdated : Jul 17, 2021, 12:21 PM IST
అర్థరాత్రి మహిళపై కానిస్టేబుల్ అత్యాచార యత్నం..!

సారాంశం

ఓ మహిళ ఈనెల 13న అర్ధరాత్రి సమయంలో మూత్ర విసర్జన కోసం వచ్చింది. ఆమెపై కన్నేసిన మహబూబ్‌ ఆమె వెనుకాలే వెళ్లి గట్టిగా పట్టుకుని ఇంటిలోకి లాక్కెళ్లాడు.

ఆపదలో ఉన్న మహిళను రక్షించాల్సిందిపోయి.. ఓ కానిస్టేబుల్ దారుణంగా ప్రవర్తించాడు. అర్థరాత్రి ఒంటరిగా ఉన్న మహిళపై అత్యాచారానికి యత్నించాడు. ఈ సంఘటన కర్ణాటక రాష్ట్రంలో  చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

కర్ణాటక రాష్ట్రం మైసూరు నగరంలోని రాఘవేంద్ర నగర్లో కానిస్టేబుల్‌ మహబూబ్‌ నివాసం ఉంటున్నాడు.ఇతని ఇంటి పక్కనే ఉంటున్న ఓ మహిళ ఈనెల 13న అర్ధరాత్రి సమయంలో మూత్ర విసర్జన కోసం వచ్చింది. ఆమెపై కన్నేసిన మహబూబ్‌ ఆమె వెనుకాలే వెళ్లి గట్టిగా పట్టుకుని ఇంటిలోకి లాక్కెళ్లాడు.

 ఈ క్రమంలో ఆమె గట్టిగా కేకలు వేయడంతో ఇంటిలో ఉన్న మరోవ్యక్తి అడ్డుకోవడానికి యత్నించాడు. పరిస్థితి అనుకూలంగా లేకపోవడంతో మహబూబ్‌ అక్కడి నుంచి పారిపోయాడు. నజరాబాద్‌ పోలీసు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.  గతంలో కూడా ఇతనిపై పలు ఆరోపణలు ఉన్నాయి.    ఉన్నతాధికారులు అతనిపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది.

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం