తాలిబన్ల దాడిలో భారత ఫోటో జర్నలిస్ట్ మృతి.. ఆఫ్గాన్ దిగ్భ్రాంతి

Published : Jul 17, 2021, 07:36 AM IST
తాలిబన్ల దాడిలో భారత ఫోటో జర్నలిస్ట్ మృతి.. ఆఫ్గాన్ దిగ్భ్రాంతి

సారాంశం

ప్ర‌ముఖ న్యూస్ ఏజెన్సీ రాయ్‌ట‌ర్స్‌కు ప‌ని చేస్తున్న ముంబైకి చెందిన 40 ఏళ్ల డానిష్ సిద్ధిఖీ.. కొద్ది రోజులగా ఆఫ్ఘానిస్తాన్ స్పెష‌ల్ ఫోర్సెస్ వెంట ఉంటూ అక్క‌డి ప‌రిస్థితిపై రిపోర్ట్ చేస్తున్నారు.

ఆప్గనిస్తాన్ లో తాలిబన్లకు, అక్కడి భద్రతా దళాలకు మధ్య జరిగుతున్న భీకర పోరులో.. భారతీయ ఫోటో జర్నలిస్ట్ బలయ్యాడు. ఆ భీకర పోరును చిత్రీకరించేందుకు వెళ్లిన ప్రముఖ భారతీయ జర్నలిస్టు, పులిట్జర్ అవార్డు గ్రహీత డానిష్ సిద్ధిఖీ మరణించారు. 
ప్ర‌ముఖ న్యూస్ ఏజెన్సీ రాయ్‌ట‌ర్స్‌కు ప‌ని చేస్తున్న ముంబైకి చెందిన 40 ఏళ్ల డానిష్ సిద్ధిఖీ.. కొద్ది రోజులగా ఆఫ్ఘానిస్తాన్ స్పెష‌ల్ ఫోర్సెస్ వెంట ఉంటూ అక్క‌డి ప‌రిస్థితిపై రిపోర్ట్ చేస్తున్నారు. గురువారం రాత్రి కందహార్ ఫ్రావిన్స్ లోని స్పిన్ బోల్డాక్ లోని ప్ర‌ధాన మార్కెట్ ప్రాంతాన్ని ఆఫ్ఘాన్ ప్ర‌త్యేక ద‌ళాలు త‌మ ఆధీనంలోకి తీసుకోవ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న స‌మ‌యంలో తాలిబ‌న్లు ఫైరింగ్ జ‌రిపారు.

తాలిబన్ల కాల్సుల్లో సిద్దిఖీతో పాటు ఓ సీనియ‌ర్ ఆఫ్ఘానిస్తాన్ ఆఫీస‌ర్ కూడా మృతి చెందారు. డానిష్ సిద్దిఖీ మరణించిన విషయాన్ని ఆఫ్ఘనిస్తాన్ లో భారతదేశ రాయబారి ఫరీద్ మముంద్​జాయ్​ శుక్రవారం కన్ఫర్మ్ చేశారు. సిద్ధిఖీ మరణం తీవ్ర విచారకరమని ఫరీద్ పేర్కొన్నారు. అదృష్టవశాత్తూ తృటిలో ప్రమాదం నుంచి తప్పించుకున్నానంటూ ట్వీట్‌ చేసిన మూడురోజుల్లోనే ఫోటో జర్నలిస్ట్ డానిష్ సిద్దిఖీ కన్నుమూయడం తీవ్ర విషాదాన్ని రేపింది.

కాగా.. సిద్దిఖీ మృతి పట్ల ఆప్గాన్ ప్రధాని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అంతేకాకుండా.. సిద్దీఖీ హత్యను భారత్ తీవ్రంగా ఖండించింది. కాందహార్ లో విధులు నిర్వహిస్తున్న భారత ఫోటో జర్నలిస్ట్  సిద్దిఖీ హత్యను తీవ్రంగా ఖండిస్తున్నామంటూ భారత్ ప్రకటించింది. వారి కుటుంబానికి సానుభూతి తెలుపుతున్నామని భారత  విదేశీ వ్యవహారాల కార్యదర్శి హర్షవర్థన్ ఐక్యరాజ్య సమితిలో తెలిపారు.

సిద్దిఖీ మృతిని భారతీయులు మాత్రమే కాకుండా.. ఆప్గనిస్తాన్ లు కూడా ఖండించారు. ఆయన మృతిని ఖండిస్తూ ర్యాలీలు కూడా నిర్వహించారు. 

PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం