రాష్ట్రపతి భవన్ కు మార్చ్ ఫాస్ట్: కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ సహా పలువురు నేతల అరెస్ట్

By narsimha lodeFirst Published Dec 24, 2020, 12:09 PM IST
Highlights

రైతుల సమస్యలను పరిష్కరించాలని విజయ్ చౌక్ నుండి  రాష్ట్రపతి భవన్ వద్దకు పాదయాత్రకు బయలుదేరిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలను గురువారం నాడు పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.
 

న్యూఢిల్లీ: రైతుల సమస్యలను పరిష్కరించాలని విజయ్ చౌక్ నుండి  రాష్ట్రపతి భవన్ వద్దకు పాదయాత్రకు బయలుదేరిన కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ సహా పలువురు నేతలను గురువారం నాడు పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.

నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ దేశంలోని సుమారు  2కోట్ల మంది రైతుల నుండి కాంగ్రెస్ పార్టీ సేకరించింది. ఈ సంతకాలను రాష్ట్రపతిని  సమర్పించడానికి విజయ్ చౌక్ నుండి కాంగ్రెస్ ఎంపీలతో  రాహుల్ గాంధీ ర్యాలీ చేపట్టారు.

also read:రాష్ట్రపతి భవన్ కు కాంగ్రెస్ నేతల పాదయాత్ర, మధ్యలోనే నిలిపిన పోలీసులు: రాహుల్ సహా ఐదుగురికి మాత్రమే అనుమతి

రాహుల్ సహా మరో ఐదుగురికి మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు. ప్రియాంక సహా మిగిలినవారిని మధ్యలోనే నిలిపివేశారు. రాష్ట్రపతి భవన్ కు వెళ్లేందుకు తమకు అనుమతి ఇవ్వాలని రోడ్డుపైనే బైఠాయించిన ప్రియాంక గాంధీ సహా ఇతర పార్టీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు.ఆందోళన చేస్తున్న రైతుల సమస్యలను వినేందుకు ప్రభుత్వం సిద్దంగా లేదని  ఆమె విమర్శించారు. 

click me!