రాష్ట్రపతి భవన్ కు కాంగ్రెస్ నేతల పాదయాత్ర, మధ్యలోనే నిలిపిన పోలీసులు: రాహుల్ సహా ఐదుగురికి మాత్రమే అనుమతి

Published : Dec 24, 2020, 11:52 AM IST
రాష్ట్రపతి భవన్ కు కాంగ్రెస్ నేతల పాదయాత్ర, మధ్యలోనే నిలిపిన పోలీసులు: రాహుల్ సహా ఐదుగురికి మాత్రమే అనుమతి

సారాంశం

 రైతుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో  రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కు కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ గురువారం నాడు వినతిపత్రం సమర్పించారు.  

న్యూఢిల్లీ:   రైతుల డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ కాంగ్రెస్ పార్టీ ఎంపీలతో  రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ కు కాంగ్రెస్ పార్టీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ గురువారం నాడు వినతిపత్రం సమర్పించారు.

నూతన వ్యవసాయ చట్టాలను నిరసిస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో 29 రోజులుగా రైతులు ఆందోళనలు నిర్వహిస్తున్నారు. రైతుల ఆ:దోళనలకు మద్దతుగా కాంగ్రెస్ పార్టీ ఇవాళ ఎంపీలతో కలిసి రాష్ట్రపతి భవన్  కు వెళ్లాలని  రాహుల్ గాంధీ నిర్ణయం తీసుకొన్నారు.

కరోనా ఆంక్షల నేపథ్యంలో రాష్ట్రపతి భవన్ కు అందరు నేతలకు పోలీసులు అవకాశం ఇవ్వలేదు. రాహుల్ గాంధీ తో పాటు గులాం నబీ ఆజాద్, అధిర్ రంజన్ చౌదరీ సహా మరో ముగ్గురి నేతలకు మాత్రమే పోలీసులు అనుమతి ఇచ్చారు.

పార్టీ కార్యాలయం నుండి రాష్ట్రపతి భవన్ వద్దకు పాదయాత్రగా వెళ్లిన కాంగ్రెస్ నేతలను పోలీసులు ఆపారు. రైతులకు మద్దతు తెలపడానికి మాత్రమే ఈ పాదయాత్ర చేస్తున్నామని కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ చెప్పారు. 

రాష్ట్రపతి భవన్ లోకి అనుమతి ఉన్న వారికి మాత్రమే  అనుమతి ఇస్తున్నామని పోలీసులు ప్రకటించారు. మిగిలిన నేతలను పోలీసులు నిలిపివేశారు.

రైతులకు సంఘీభావం నుండి  దేశంలో నుండి 2 కోట్ల మంది సంతకాలను రాష్ట్రపతికి సమర్పించాలని విజయ్ చౌక్ నుండి రాష్ట్రపతి భవన్ కు కాంగ్రెస్ ఎంపీలు పాదయాత్ర తలపెట్టారు. ఈ పాదయాత్రను పోలీసులు నిలిపివేయడంతో అనుమతి ఉన్న నేతలే  రాష్ట్రపతి భవన్ కు ;పోలీసులు అనుమతి ఇచ్చారు. 

 

PREV
click me!

Recommended Stories

IT Jobs : ఇక TCS లో ఉద్యోగాలే ఉద్యోగాలు
Nuclear Devices in Himalayas : నెహ్రూ, ఇందిరాలే ప్రస్తుత ప్రకృతి విపత్తులకు కారణమా..?