యూపీలో దారుణం...కారు ఆపనందుకు యువకుడిని కాల్చి చంపిన పోలీసులు

By sivanagaprasad kodatiFirst Published Sep 30, 2018, 11:15 AM IST
Highlights

ఉత్తరప్రదేశ్‌లో పోలీసుల ఓవరాక్షన్ కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. కారు ఆపనందుకు ఓ సాప్ట్‌వేర్ ఇంజనీర్‌ను పోలీసులు కాల్చి చంపారు. లక్నోకి చెందిన వివేక్ తివారీ యాపిల్ కంపెనీలో మెనేజర్‌గా పనిచేస్తున్నాడు. 

ఉత్తరప్రదేశ్‌లో పోలీసుల ఓవరాక్షన్ కారణంగా ఓ నిండు ప్రాణం బలైంది. కారు ఆపనందుకు ఓ సాప్ట్‌వేర్ ఇంజనీర్‌ను పోలీసులు కాల్చి చంపారు. లక్నోకి చెందిన వివేక్ తివారీ యాపిల్ కంపెనీలో మెనేజర్‌గా పనిచేస్తున్నాడు. గత శుక్రవారం రాత్రి విధులు ముగించుకుని మరో ఉద్యోగితో కలిసి తన కారులో ఆయన ఇంటికి వెళుతున్నాడు.

ఈ సమయంలో ముకదమ్‌పూర్ వద్ద పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో కారును ఆపాల్సిందిగా వివేక్‌ను ఇద్దరు పోలీసులు సైగ చేశారు.. అయితే అతను కారు ఆపకుండా వేగంగా ముందుకు పోనిచ్చాడు..

దీంతో ప్రశాంత్ చౌదరి అనే కానిస్టేబుల్ వివేక్ కారును ఓవర్‌టేక్ చేసి కాల్పులు జరిపాడు.. ఈ క్రమంలో కారు డివైడర్‌ను ఢీకొని ఆగిపోయింది..తల్లోకి బుల్లెట్ దూసుకెళ్లడంతో వివేక్‌ను సమీపంలోని లోహియా ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మరణించాడు.

పోలీసులు అన్యాయంగా తన భర్తను చంపారంటూ వివేక్ భార్య ఆరోపించారు.. సీఎం వచ్చి పరామర్శించే వరకూ అంత్యక్రియలు నిర్వహించబోనన్నారు... సీబీఐ విచారణతో పాటు పోలీస్ శాఖలో తన చదువుకు తగ్గ ఉద్యోగం, రూ.కోటీ నష్టపరిహారం చెల్లించాలని ఆమె డిమాండ్ చేశారు.

మరోవైపు ఆత్మరక్షణ కోసమే తాను కాల్పులు జరపాల్సి వచ్చిందన్నారు కానిస్టేబుల్ ప్రశాంత్.. తెల్లవారుజామున ఓ కారు లైట్లు ఆర్పేసి అనుమానాస్పదంగా ఉండటంతో.. దగ్గరకు వెళ్లి చూశానని.. అయితే డ్రైవింగ్ సీట్లో ఉన్న వివేక్ కారును నా మీద నుంచి పోనిచ్చేందుకు యత్నించాడన్నారు.

ఇలా 3 సార్లు చేశాడని.. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో కాల్పులు జరిపానని చెప్పాడు. ఈ ఘటనపై కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ స్పందించారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌తో మాట్లాడి దోషులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా సూచించారు.

click me!