యువతిని, ఆమె తల్లిని హత్య చేసిన దుండగుడు.. ఇంట్లోకి దూరి మరి దారుణం.. అదే కారణమా..?

Published : Sep 02, 2022, 11:07 AM IST
యువతిని, ఆమె తల్లిని హత్య చేసిన దుండగుడు.. ఇంట్లోకి దూరి మరి దారుణం.. అదే కారణమా..?

సారాంశం

ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని కాశీపూర్ ప్రాంతంలో 25 ఏళ్ల యువతిని, ఆమె తల్లిని ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. అనంతరం స్థానిక పోలీసు అవుట్‌ పోస్టుకు వెళ్లి లొంగిపోయాడు.

ఉత్తరాఖండ్‌లోని ఉధమ్‌సింగ్ నగర్‌ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. జిల్లాలోని కాశీపూర్ ప్రాంతంలో 25 ఏళ్ల యువతిని, ఆమె తల్లిని ఓ వ్యక్తి దారుణంగా హత్య చేశాడు. అనంతరం స్థానిక పోలీసు అవుట్‌ పోస్టుకు వెళ్లి లొంగిపోయాడు. తాను నేరం చేసినట్టుగా అంగీకరించాడు. నిందితుడిని మహ్మద్ సల్మాన్‌గా‌, యువతిని షీబా, ఆమె తల్లి షబానా ఖాతూన్‌గా గుర్తించారు. నిందితుడు గురువారం షీబాను వీధిలో చూసిన తర్వాత ఆమెపై కొడవలితో దాడి చేశాడు. ఆ తర్వాత అతను షీబా ఇంట్లోకి ప్రవేశించి ఆమె తల్లిని చంపాడు. ఇద్దరు మహిళలు రక్తపు మడుగులో పడి ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. 

ఇక, యువతితో తాను సంబంధం కలిగి ఉన్నాయని.. అయితే కొంతకాలంగా తనతో మాట్లాడకపోవడంతోనే హత్యలు చేసినట్టుగా నిందితుడు ఆరోపించాడు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను పోలీసులు వెల్లడించారు.  

‘‘గురువారం ఉదయం 11.30 గంటలకు రక్తంతో తడిసిన కొడవలితో సల్మాన్ బాన్స్‌ఫోడాన్ పోలీసు అవుట్‌పోస్ట్‌కు చేరుకున్నాడు. విచారణలో అతని ఇంటికి పొరుగున ఉండే మహిళతో సంబంధం కలిగి ఉన్నాడని సల్మాన్ పోలీసులకు చెప్పాడు. అయితే కొంతకాలంగా ఆమె అతడి నుంచి తప్పించుకుంటూ వచ్చిందని తెలిపాడు. అందుకే ఆవేశానికి లోనైన ఆమె, ఆమె తల్లి గొంతు నులిమి చంపేశానని చెప్పాడు’’ అని పోలీసులు చెప్పారు. 

ఇక, ప్రస్తుతం షీబా, తన తల్లితో కలిసి ఇంట్లో ఒంటరిగా ఉంటుంది. గత వారం మహిళ తండ్రి, ఆమె సోదరుడు దుబాయ్‌కు వెళ్లారు. దీంతో పోలీసులు ఈ ఘటనపై వారికి సమాచారం పంపారు. మృతదేహాలను పోస్టుమార్టమ్ నిమిత్తం తరలించారు. నిందితుడుని అరెస్ట్ చేసినట్టుగా పోలీసులు వెల్లడించారు. ఇక, దుబాయ్‌లో ప్లంబర్‌గా పనిచేసిన సల్మాన్ ఆగస్టులో ఇండియాకు తిరిగివచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే షీబాపై సల్మాన్ దాడి చేస్తున్న సమయంలో తాము ఆపేందుకు చూసిన ఆ ప్రయత్నాలు ఫలించలేదని కొందరు స్థానికులు చెప్పారు. 

PREV
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌