హీరోయిన్ ఛాన్స్ ఇస్తామంటూ లైంగిక దాడి..!

Published : Jul 21, 2021, 08:53 AM IST
హీరోయిన్ ఛాన్స్ ఇస్తామంటూ లైంగిక దాడి..!

సారాంశం

తనకు అనేక మంది సినీ దర్శకులు తెలుసని, త్వరలో హీరోయిన్‌గా అవకాశం ఇప్పిస్తానని నమ్మించి లైంగిక వాంఛ తీర్చుకున్నాడు.

సినిమాల్లో హీరోయిన్ గా ఛాన్స్ ఇప్పిస్తామంటూ నమ్మించి ఓ యువతిపై లైంగిక దాడికి పాల్పడ్డారు. కాగా.. తనను దారుణంగా మోసం చేసిన నిందితులను శిక్షించాలంటూ యువతి పోలీసులను ఆశ్రయించింది. ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకోగా... ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఈరోడ్ జిల్లాకు చెందిన ఓ యువతి(24) చెన్నెలోని ఓ అపార్ట్ మెంట్ లో ఉంటూ మూడేళ్లుగా సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తోంది. ఈ క్రమంలో ఆమెకు అడయార్‌కు చెందిన గణేష్‌తో పరిచయం ఏర్పడింది. తనకు అనేక మంది సినీ దర్శకులు తెలుసని, త్వరలో హీరోయిన్‌గా అవకాశం ఇప్పిస్తానని నమ్మించి లైంగిక వాంఛ తీర్చుకున్నాడు.

అతని స్నేహితులు సైతం ఆమెతో గడిపారు. అయితే సినిమా అవకాశాలు ఇప్పించలేదు. ఇలావుండగా తనపై లైంగికదాడి చేసిన గణేష్‌ అతని స్నేహితులపై చర్యలు తీసుకోవాలని ఇటీవల యువతి అడయారు మహిళా పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. సోమవారం సాయంత్రం విచారణ కోసం పోలీసు స్టేషన్‌ రావాల్సిందిగా యువతిని మహిళా పోలీసులు కోరారు. దీంతో యువతి తన స్నేహితుడితో కారులో వెళ్లింది.

వడపళని సమీపంలో వెళుతుండగా యువతి హఠాత్తు గా స్పృహ తప్పింది. వెంటనే ఆమెను స్థానిక ఆస్పత్రిలో చేర్చారు. ఆమె మోతాదుకు మించి నిద్రమాత్రలు మింగినట్లు తెలిసింది. ఆమెకు తీవ్ర చికిత్స అందిస్తున్నారు. తన మృతికి గణేష్‌ కారణమని తెలుపుతూ బ్యాగులో లేఖ దొరికింది. విరుగంబాక్కం పోలీసులు విచారణ జరుపుతున్నారు. 

PREV
click me!

Recommended Stories

అధికారులను పరుగులు పెట్టిస్తున్న సీఎం విజయ్ | CM Joseph Vijay Distributes Ration to Families
తమిళనాడులో విద్యుత్ బస్ స్టేషన్ లను పరిశీలించిన సీఎం విజయ్ | CM Vijay Inspects EV MTC Bus Depo