బర్డ్ ఫ్లూతో భారత్ లో తొలి మరణం..!

By telugu news teamFirst Published Jul 21, 2021, 7:27 AM IST
Highlights

హర్యానాకు చెందిన సుశీల్ అనే బాలుడు న్యుమోనియా, లుకేమియా లక్షణాలతో ఈ నెల 2న ఢిల్లీ ఎయిమ్స్ లో చేరాడు. దీంతో పరీక్షించిన వైద్యులు మొదట కరోనా పరీక్ష నిర్వహించగా నెగిటివ్ అని తేలింది.

భారత్ లో  బర్డ్ ఫ్లూ కారణంగా తొలి మరణం నమోదైంది. బర్డ్ ఫ్లూ సోకి దేశ రాజధాని ఢిల్లీలోని ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ చనిపోయాడు. దీంతో.. బాలుడికి చికిత్స అందించిన వైద్యులు, సిబ్బంది ఐసోలేషన్ కి వెళ్లారు. ఏవైనా లక్షణాలు కనిపిస్తే వెంటనే రిపోర్టు  చేయాలని వైద్య నిపుణులు వారికి సూచించారు.

భారత్ లో బర్డ్ ఫ్లూ వచ్చి వ్యక్తి చనిపోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. హర్యానాకు చెందిన సుశీల్ అనే బాలుడు న్యుమోనియా, లుకేమియా లక్షణాలతో ఈ నెల 2న ఢిల్లీ ఎయిమ్స్ లో చేరాడు. దీంతో పరీక్షించిన వైద్యులు మొదట కరోనా పరీక్ష నిర్వహించగా నెగిటివ్ అని తేలింది.

అనంతరం నమూనాలను పూణేలోని జాతీయ వైరాలజీ సంస్థకు పంపించారు. అక్కడ బర్డ్ ఫ్లూగా తేలింది. దీంతో మరిన్ని కేసులు గుర్తించడానికి కాంట్రాక్ట్ ట్రేస్ చేయడానికి నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ ఓ బృందాన్ని హర్యానాలోని బాలుడు స్వగ్రామానికి పంపించారు.

బర్డ్ ఫ్లూను హెచ్5ఎన్1 వైరస్ లేదా ఏవియన్ ఇన్ ఫ్లూయెంజాగా పిలుస్తారు. ఇది పక్షులు , కోళ్లలో వస్తుంది, బర్డ్ ఫ్లూ ఓ మనిషికి సోకడం భారత్ లో ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఈ నెల 15న బర్డ్ ఫ్లూ వైరస్ జాతి అయిన హెచ్5ఎన్6 స్ట్రెయిన్ చైనాలో ఓ వ్యక్తికి సోకినట్లు వార్తలు వచ్చాయి.

ఈ ఏడాది ప్రారంభంలో భారత్ లో బర్డ్ ఫ్లూ విరుచుకుపడింది. మహారాష్ట్ర, గుజరాత్, ఛత్తీస్ గఢ్, కేరళ, మధ్యప్రదేశ్, ఉత్తరఖండ్, ఉత్తరప్రదేశ్, పంజాబ్ లో ఇది వెలుగు చూడటంతో.. వేల సంఖ్యలో పక్షులు, కోళ్లు చనిపోయాయి. కేవలం పంజాబ్ లోనే 50వేలకు పైగా పక్షలు చనిపోవడం గమనార్హం.

click me!