నదిలో రెండుగంటలు ఛేజింగ్.. విగ్రహాల దొంగ అరెస్ట్.. !

Published : Jul 06, 2021, 09:20 AM IST
నదిలో రెండుగంటలు ఛేజింగ్.. విగ్రహాల దొంగ అరెస్ట్.. !

సారాంశం

విగ్రహాల దొంగను పట్టుకునేందుకు అతని ఇంటికి పోలీసులు వస్తే అతను తప్పించుకునేందుకు బ్రాహ్మణి నదిలోకి దూకిన ఘటన ఒడిశా రాష్ట్రంలో వెలుగు చూసింది. ఒడిశాలోని పట్టాముంబై పోలీస్ స్టేషన్ పరిధిలోని దండిసాహి గ్రామ రామాలయంలోని విగ్రహాలను దొంగ భారత్ మల్లిక్ దొంగిలించాడు. 

నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు అతని ఇంటికి వస్తే భారత్ మల్లిక్ పారిపోయేందుకు కేంద్రపారాజిల్లాలోని బ్రాహ్మణి నదిలోకి దూకాడు. నదిలో రెండు గంటలపాటు వెంటాడిన పోలీసులు నిందితుడు మల్లిక్ ను అరెస్ట్ చేశారు. మల్లిక్ ఇంట్లో నుంచి విగ్రహాలు, ఇతర విలువైన వస్తువులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 

విగ్రహాల దొంగతనం కేసులో నిందితుడైన మల్లిక్ గత ఈతగాడు కావడంతో అతన్ని పట్టుకునేందుకు పోలీసులు అగ్నిమాపక దళ సిబ్బందిని రంగంలోకి దించి అరెస్ట్ చేశారు. నదిలో పారిపోయిన నిందితుడిని పట్టుకునేందుకు తాము రెండు పడవలను ఉపయోగించామని సబ్ డివిజన్ పోలీసు అధికారిణి సంధ్యారాణి బెహురియా చెప్పారు. విచారణలో తాను ఆలయం ప్రధాన తలుపు తెరిచి గర్భగుడిలోకి ప్రవేశించి విగ్రహాలు చోరీ చేశానని అంగీకరించాడు. 

PREV
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్