కాంగ్రెస్‌కి షాక్: టీఎంసీలో చేరిన మాజీ రాష్ట్రపతి తనయుడు అభిజిత్ ముఖర్జీ

By narsimha lodeFirst Published Jul 5, 2021, 7:47 PM IST
Highlights

మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ  సోమవారం నాడు తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. కోల్‌కతాలోని పార్టీ కార్యాలయంలో  అభిజిత్‌ ముఖర్జీకి, టీఎంసీ నేతలు పార్థా ఛటర్జీ, సుదీప్ బంధోపాధ్యాయలు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇంతకాలం కాంగ్రెస్‌లో ఉన్న అభిజిత్ తండ్రి మరణం తర్వాత టీఎంసీలో జాయినయ్యారు.


కోల్‌కత్తా:  మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ కుమారుడు అభిజిత్ ముఖర్జీ  సోమవారం నాడు తృణమూల్ కాంగ్రెస్‌లో చేరారు. కోల్‌కతాలోని పార్టీ కార్యాలయంలో  అభిజిత్‌ ముఖర్జీకి, టీఎంసీ నేతలు పార్థా ఛటర్జీ, సుదీప్ బంధోపాధ్యాయలు పార్టీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఇంతకాలం కాంగ్రెస్‌లో ఉన్న అభిజిత్ తండ్రి మరణం తర్వాత టీఎంసీలో జాయినయ్యారు.

 2011లో మొదటిసారి బెంగాల్ అసెంబ్లీకి ఎన్నికయ్యారు అభిజిత్. 2012లో ప్రణబ్ ముఖర్జీ రాష్ట్రపతిగా ఎన్నిక కావడంతో ఆయన రాజీనామా చేసిన జంగీపూర్ స్థానం నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. తర్వాత 2014లోనూ అదే నియోజకవర్గం నుంచి మరోసారి ఎంపీగా గెలిచారు అభిజిత్‌ ముఖర్జీ.

బెంగాల్ రాష్ట్రంలో బీజేపీని అధికారంలోకి రాకుండా అడ్డుకోవడంలో మమత బెనర్జీ సక్సెస్ అయ్యారని ఆయన చెప్పారు. బీజేపీతో పోరాటం చేయడంతో పాటు ఆ పార్టీని ఁఓడించే అత్యంత విశ్వసనీయ లౌకిక నాయకురాలు మమత అని ఆయన అభిప్రాయపడ్డారు. 
 

click me!