యువతికి బలవంతంగా ముద్దు.. యువకుడు అరెస్ట్

Published : Apr 15, 2019, 11:44 AM IST
యువతికి బలవంతంగా ముద్దు.. యువకుడు అరెస్ట్

సారాంశం

ఓ యువతికి బలవంతంగా ముద్దు పెట్టినందుకు యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాకుండా అలా ముద్దు పెడుతుండగా తీసిన ఫోటోని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  

ఓ యువతికి బలవంతంగా ముద్దు పెట్టినందుకు యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అంతేకాకుండా అలా ముద్దు పెడుతుండగా తీసిన ఫోటోని కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.  ఈ సంఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

చెన్నై మడిపాక్కం పాలయాగార్డెన్స్ కి చెందిన యువతి(18) ప్రైవేటు ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. కాగా.. ఆమెను స్కూల్లో ఉన్నప్పటి నుంచే శ్రీనాథ్ అనే యువకుడు ప్రేమిస్తున్నాడు. ఆ విషయం యువతికి చాలా సార్లు చెప్పాడు. కానీ ఆమె తిరస్కరించింది.

అయితే.. ఈ క్రమంలో యువతి తన స్నేహితులతో కలిసి మహాబలిపురం టూర్ కి వెళ్లారు.  ఆ సమయంలో ఆమెతో శ్రీనాథ్ సెల్ఫీ దిగాడు. ఆ ఫోటోని చూపించి బ్లాక్ మొయిల్ చేయడం మొదలుపెట్టాడు. కుటుంబసభ్యులకు చూపిస్తానని బెదిరించడం మొదలుపెట్టాడు. 

తనకు ముద్దు పెట్టాలని లేదంటే ఈ ఫొటోను  ఫేస్‌బుక్‌లో పెడతానని బ్లాక్‌ మెయిల్‌ చేశాడు. దీంతో ఆమె ముద్దు పెట్టింది. అయితే ముద్దు పెడుతున్న దృశ్యాన్ని మరో విద్యార్థి ఫొటో తీసినట్లు తెలిసింది. దీనిపై విద్యార్థిని తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఆదివారం శ్రీనాథ్‌తో పాటు అతని స్నేహితుడిని అరెస్టు చేశారు.
 

PREV
click me!

Recommended Stories

Tata Nexon : కేవలం 30K సాలరీ ఉన్న చిరుద్యోగులు కూడా... ఈ కారును మెయింటేన్ చేయవచ్చు
Gleeden App: ఇదేం క‌ర్మ దేవుడా.. వివాహేత‌ర సంబంధాల కోసం కూడా యాప్‌. మ‌హిళ‌లే టాప్