భార్య గొంతెమ్మ కోరికలు తీర్చడానికి ఓ భర్త..

Published : Dec 01, 2020, 08:47 AM IST
భార్య గొంతెమ్మ కోరికలు తీర్చడానికి ఓ భర్త..

సారాంశం

భావ్ నగర్ జిల్లా జలియా గ్రామానికి చెందిన బల్వంత్ చౌహాన్ వజ్రాలకు మెరుగులుదిద్దే పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా.. చాలీచాలని డబ్బులతో వారి జీవితం సాధారణంగా సాగిపోయేది. 

భార్య గొంతెమ్మ కోరికలు తీర్చడానికి ఓ భర్త ఏకంగా దొంగగా మారాడు. ఆమె కోరికనవన్నీ అందించడానికి తన వద్ద డబ్బు లేకపోవడంతో..దొంగలా మారి ఆమె కోరికలు తీర్చాడు. వరసగా బైకులు దొంగతనాలు చేస్తూ.. వాటిని అమ్మిన డబ్బుతో విలాసంగా జీవిస్తూ వచ్చాడు. కాగా.. చివరకు జైలుపాలయ్యాడు. ఈ సంఘటన గుజరాత్ లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

 భావ్ నగర్ జిల్లా జలియా గ్రామానికి చెందిన బల్వంత్ చౌహాన్ వజ్రాలకు మెరుగులుదిద్దే పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కాగా.. చాలీచాలని డబ్బులతో వారి జీవితం సాధారణంగా సాగిపోయేది. కాగా.. ఆ జీవితం బల్వంత్ భార్యకు నచ్చలేదు. తనకు లగ్జరీ లైఫ్ కావాలంటూ భర్తపై ఒత్తిడి తెచ్చేది.

దీంతో ఆమె పోరు భరించలేక బైకుల దొంగతనాలు మొదలుపెట్టాడు. అయితే లాక్‌డౌన్‌ కారణంగా ఉద్యోగం పోవటంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే పూర్తి స్థాయిలో బైకుల దొంగతనాలను మొదలుపెట్టాడు. 2017లో మొదటిసారి బైకు దొంగతనం చేశాడు. అనంతరం 2019లో నాలుగు.. 2020లో ఏకంగా 25 బైకుల్ని దొంగిలించాడు. ఆదివారం బైకు దొంగతనం చేస్తూ పోలీసులకు పట్టుబడ్డాడు. 

PREV
click me!

Recommended Stories

Nepal Flash Floods: నేపాల్ వరదల్లో కొట్టుకొచ్చిన వందలాది మృ*తదేహాలు | Asianet News Telugu
భారీ వరదల తర్వాత నేపాల్ లో ప్రస్తుత పరిస్థితి | Drone Visuals | Nepal Flash Floods | From Devi Ghat