అమెరికాలో ఉద్యోగం.. భారత్ లో దొంగతనాలు..!

By telugu news teamFirst Published Nov 28, 2020, 8:36 AM IST
Highlights

అప్పటి నుంచి పెద్ద వ్యాపారవేత్తలను, కలెక్షన్ ఏంజెంట్లను లక్ష్యంగా చేసుకున్నాడు. అవినాష్ శర్మ పథకం రూపొందిస్తే.. మిగితావారు దానిని అమలు చేసేవారు

అమెరికాలో ఉద్యోగం చేసి ఇటీవల భారత్ కి వచ్చిన ఓ వ్యక్తి.. ఇక్కడ దొంగతనాలకు పాల్పడ్డాడు. ఈ సంఘటన దేశ రాజధాని ఢిల్లీలో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.  ఢిల్లీకి చెందిన అవినాష్ శర్మ(60) 1990లో అమెరికాకు వెళ్లాడు. దాదాపు పాతిక సంవత్సరాలు  అక్కడే ఉన్నాడు.  అక్కడ పౌరసత్వం  లభించకపోవడంతో ఇటీవల 2015 లో తిరిగి భారత్ కి వచ్చాడు.

భారత్ కి తిరిగి వచ్చేసిన తర్వాత ఒక ఎలక్ట్రికల్ కంపెనీలో ఉద్యోగంలో చేరాడు. కానీ అమెరికాలో విలాసవంతమైన జీవనానికి అలవాటు పడిన అతనికి భారత్ లో జీతం సరిపోకపోవడంతో అసంతృప్తితో ఉండేవాడు. ఈ నేపథ్యంలో తన స్నేహితుడు రవిగుప్తాతో చేతులు కలిపి.. రోహిత్, అమిత్ అనే వ్యక్తులతో కలిసి 2017లో ఒక గ్యాంగ్ గా ఏర్పడ్డాడు.

అప్పటి నుంచి పెద్ద వ్యాపారవేత్తలను, కలెక్షన్ ఏంజెంట్లను లక్ష్యంగా చేసుకున్నాడు. అవినాష్ శర్మ పథకం రూపొందిస్తే.. మిగితావారు దానిని అమలు చేసేవారు. ఈ ఘటనల్లో బాధితులు ఇద్దరు క్రైం బ్రాంచ్ ను ఆశ్రయించడంతో వీరిపై దృష్టిసారించారు.

వీరిని పట్టుకునేందుకు ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరిని గుర్తించిన అధికారులు విజయ్ విహార్ లోని ఓ అపార్ట్ మెంట్ లో అరెస్టు  చేశారు. వీరి నుంచి మూడు తుపాకులు, ఒక కారును స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు. అకౌంటెంట్ అయిన రవిగుప్తా వీరు దోచుకోవలసిన వారి జాబితా తయారు చేసేవాడని పేర్కొన్నారు. ఢిల్లీ చుట్టుపక్కల ప్రాంతాల్లోని అనేక మంది వ్యాపారవేత్తల నుంచి వీరు సుమారు రెండు కోట్ల రూపాయల వరకు దోచుకున్నారని వారు వివరించారు.
 

click me!