రాజ్యాంగ నిర్మాతలకు ఎన్ఎస్ఐసీ సీఎండీ ఘన నివాళి

Siva Kodati |  
Published : Nov 27, 2020, 06:02 PM ISTUpdated : Nov 27, 2020, 06:03 PM IST
రాజ్యాంగ నిర్మాతలకు ఎన్ఎస్ఐసీ సీఎండీ ఘన నివాళి

సారాంశం

సంవిధాన్ దివస్‌ను పురస్కరించుకుని న్యూఢిల్లీలోని నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పోరేషన్ (ఎన్ఎస్ఐసీ) సీఎండీ విజయేంద్ర.. రాజ్యాంగ నిర్మాతలకు నివాళులర్పించారు. ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. 

సంవిధాన్ దివస్‌ను పురస్కరించుకుని న్యూఢిల్లీలోని నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పోరేషన్ (ఎన్ఎస్ఐసీ) సీఎండీ విజయేంద్ర.. రాజ్యాంగ నిర్మాతలకు నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ఉద్యోగులను ఉద్దేశించి ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో పీ అండ్ ఎం డైరెక్టర్, పీ ఉదయ కుమార్, ఫైనాన్షియల్ డైరెక్టర్ గౌరంగ్ దీక్షిత్ పాల్గొన్నారు.  

భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26న అని అందరికీ తెలుసు. అందుకే ఆ రోజున గణతంత్ర దినోత్సవం జరుపుకొంటారు. అయితే ఆ రాజ్యాంగానికి ఆమోదముద్ర పడింది మాత్రం గణతంత్ర దినోత్సవానికి సరిగ్గా రెండు నెలల ముందు.

అంటే 1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని సభలో ప్రవేశపెట్టే ముందు అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్రప్రసాద్... మహాత్మాగాంధీకి నివాళులు అర్పించి ప్రసంగించారు.

రాజ్యాంగాన్ని ఆమోదించిన తర్వాత జాతీయ గీతం 'జనగణమన'ను స్వాతంత్ర్య సమరయోధురాలు పూర్ణిమా బెనర్జీ ఆలపించారు. 1949 నవంబర్ 26న రాజ్యాంగానికి ఆమోదముద్ర పడినా... రాజ్యాంగ దినోత్సవం నిర్వహించలేదు.

ఆ ఆనవాయితీ 2015లో మొదలైంది. ప్రతీ ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని భారత ప్రభుత్వం 2015 నవంబర్ 19న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది.

రాజ్యాంగం గొప్పదనాన్ని తెలిపే ప్రసంగాలు, ఉపన్యాసాలు, వ్యాసరచన లాంటి కార్యక్రమాలను ప్రభుత్వాఫీసుల్లో నిర్వహించాలని సూచించింది. అలా 2015 నుంచి ప్రతీ ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపుకొంటున్నాం. రాజ్యాంగ దినోత్సవాన్ని "సంవిధాన్ దివస్"అని కూడా పిలుస్తారు.

PREV
click me!

Recommended Stories

వీడు మామూలోడు కాదు.. ఫిట్ నెస్ కా బాప్ బాబా రాందేవ్ నే చిత్తుచేసిన తోపు..! (Viral Video)
IRCTC New Rates: టికెట్ ధరలు పెంచిన రైల్వే.. హైదరాబాద్ నుంచి వైజాగ్, తిరుపతికి రేట్లు ఇవే !