వాజ్‌పేయ్: 24 ఏళ్ల తర్వాత ఫోఖ్రాన్ అణు పరీక్షలతో సత్తా

By narsimha lodeFirst Published Aug 16, 2018, 5:55 PM IST
Highlights

వాజ్‌పేయ్ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో పోఖ్రాన్‌లో నిర్వహించిన అణుపరీక్షలు  పెద్ద సంచలనం సృష్టించాయి. రాజస్థాన్‌ రాష్ట్రంలోని ఫోఖ్రాన్‌లో ఈ పరీక్షలు నిర్వహించారు.  
 


న్యూఢిల్లీ: వాజ్‌పేయ్ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో పోఖ్రాన్‌లో నిర్వహించిన అణుపరీక్షలు  పెద్ద సంచలనం సృష్టించాయి. రాజస్థాన్‌ రాష్ట్రంలోని ఫోఖ్రాన్‌లో ఈ పరీక్షలు నిర్వహించారు.  

కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న కాలంలో అంతకుముందు దేశంలో అణు పరీక్షలు జరిగాయి. ఆ తర్వాత వాజ్‌పేయ్ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలోనే పోఖ్రాన్ లో అణు పరీక్షలు నిర్వహించారు.  ఈ అణు పరీక్షలు అప్పట్లో సంచలనం సృష్టించాయి.

24 ఏళ్ల తర్వాత వాజ్‌పేయ్ ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో  అణు పరీక్షలు నిర్వహించారు. 1974లో బుద్దాలో అణు పరీక్షలు నిర్వహించారు. కేంద్రంలో వాజ్‌పేయ్ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన  నెల రోజులకే ఈ పరీక్షలు నిర్వహించారు.

1998 మే 11, 13 తేదీల్లో ఫోఖ్రాన్‌లో ఐదు చోట్ల అణుపరీక్షలు నిర్వహించారు. తేదీన పోఖ్రాన్‌లో అణుపరీక్షలు నిర్వహించారు. వాజ్‌పేయ్ కు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలామ్ అడ్వైజర్ గా ఉన్నారు. ఫోఖ్రాన్‌లో అణు పరీక్షల్లో ఆయన కీలకంగా వ్యవహరించారు. ఐదు చోట్ల   పరీక్షలను నిర్వహించారు.  
 

click me!