మోదీకి ‘ఫొగొనోట్రోఫీ’ అందుకే గడ్డం పెంచుతున్నారు.. శశిథరూర్ సెటైర్లు

Published : Jul 03, 2021, 01:42 PM IST
మోదీకి ‘ఫొగొనోట్రోఫీ’ అందుకే గడ్డం పెంచుతున్నారు.. శశిథరూర్ సెటైర్లు

సారాంశం

శశిథరూర్ ఆంగ్ల భాషా పరిజ్ఞానం గురించి తెలిసిందే. ఈ కేరళ కాంగ్రెస్ ఎంపీ మాట్లాడుతుంటే నిఘంటువు వెతుక్కోవాల్సిందే. తాజాగా ఆయన ‘ఫొగొనోట్రోఫీ’ అనే పదం వాడి ట్విటర్ లో హల్ చల్ సృష్టించారు. ఈ పదంతో ప్రధాని మోదీ గడ్డానికి లంకె పెట్టారు. 

ఫొగొనోట్రోఫీ అంటే గడ్డం పెంచడం. కరోనా సమయంలో మోదీ కూడా ఫొగొనోట్రోఫీయే చేస్తున్నారంటూ థరూర్ వ్యంగాస్త్రం విసిరారు. ఓ కొత్త పదం నేర్పాలంటూ ట్విటర్ లో ఓ వైద్యురాలు అడిగిన ప్రశ్నకు థరూర్ బదులిస్తూ.. ‘నా స్నేహితుడు, ఆర్థిక వేత్త రతిన్ రాయ్ ఈ రోజు నాకు ఓ కొత్త పదం నేర్పించాడు. ఫొగొనోట్రోఫీ.. అంటే గడ్డం పెంచడం.. మహమ్మారి వేళ ప్రధానికి కూడా ఫొగొనోట్రోఫీ వ్యాపకంగా మారింది ’ అంటూ ట్వీట్ చేశారు. 
 
PREV
click me!

Recommended Stories

Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌
Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం