చెన్నై లో కిడ్నాప్ చేసి, పుత్తూరులో చంపేశారు.. బంగారం కోసం మేనల్లుడి దారుణం..

By AN TeluguFirst Published Aug 3, 2021, 11:28 AM IST
Highlights

చిత్తూరుకు చెందిన సంజీవి రెడ్డి మనవరాలు లోచి ఫోన్ కాల్ తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. లోచి తల్లి జ్యోతిశ్రీ  జూలై 28 న మరణించింది. ఆ రోజు తాతతో మాట్లాడింది. తరువాతి రోజు కూడా అతనికి కాల్ చేస్తే.. ఫోన్ ఎత్తలేదు. 

చెన్నై: తిరుత్తణిలోని తమ ఇంటి నుండి అదృశ్యమైన ఓ జంట ఆంధ్రప్రదేశ్ విగతజీవులుగా దొరికారు. తిరుత్తణికి చెందిన 68 ఏళ్ల పిఎంకె కార్మికుడు, అతని భార్య జూలై 28న అదృశ్యమయ్యారు. వారిని అతని మేనల్లుడు కిడ్నాప్ చేసి కొట్టి చంపినట్లు పోలీసులు సోమవారం తెలిపారు.

అక్కడే పెడితే నేరం బయటపడుతుందని..వారి మృతదేహాలను ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని పుత్తూరు వద్ద అటవీ ప్రాంతంలో ఖననం చేశారు. హంతకులు వారింట్లో ఉన్న రూ.54 లక్షల విలువైన 150 సవర్ల బంగారు ఆభరణాలను, రూ. 50 లక్షల నగదును దోచుకెళ్లారని ఒక అధికారి తెలిపారు.

మృతులు తిరుత్తని, మాలలో ప్రైవేట్ చిట్ ఫండ్ నడుపుతున్న సంజీవి రెడ్డిగా గుర్తించారు. సంజీవి రెడ్డి మేనల్లుడు రంజిత్ కుమార్ (28), అతని స్నేహితుడు విమల్‌రాజ్‌లు వీరిద్దరిని పుత్తూరు ఎత్తుకొచ్చి..  వృద్ధ దంపతుల హత్యకు పాల్పడినట్లు తెలిపారు. వారిని త్వరలోనే అదుపులోకి తీసుకుంటామని తెలిపారు.  

అయితే, చిత్తూరుకు చెందిన సంజీవి రెడ్డి మనవరాలు లోచి ఫోన్ కాల్ తో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. లోచి తల్లి జ్యోతిశ్రీ  జూలై 28 న మరణించింది. ఆ రోజు తాతతో మాట్లాడింది. తరువాతి రోజు కూడా అతనికి కాల్ చేస్తే.. ఫోన్ ఎత్తలేదు. 

సంజీవ్ రెడ్డి మొబైల్ రింగ్ అవవుతూ, కట్ అవుతుంది. ఎన్నిసార్లు చేసినా ఇలాగే అవుతుండడంతో అనుమానం వచ్చి లోచి.. తిరుత్తని సమీపంలోని పట్టాభిరామపురం గ్రామానికి చెందిన మరో తాత బాలుకు ఫోన్ చేసి సంజీవి రెడ్డి ఇంటికి వెళ్లమని అభ్యర్థించింది. 

బాలు వెళ్లి చూడగా ఇంటికి బయటి నుండి లాక్ చేయబడి ఉంది. దీంతో బాలు, ఇంకొంతమంది గ్రామస్తులు తలుపులు పగలగొట్టి చూశారు. ఇంట్లో వీరి ఆచూకీ లేదు. అంతేకాదు సేఫ్ లాకర్, అల్మారాలు పగలగొట్టి ఉన్నాయి. అందులోని బంగారం, నగదు కనిపించలేదు. దీంతో వారు వెంటనే తిరుత్తని పోలీసులకు ఫిర్యాదు చేశారు.

వెంటనే దర్యాప్తులోకి దిగిన పోలీసులు సంజీవ్ రెడ్డి ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా మొబైల్ టవర్ స్థానాన్నిగుర్తించారు. అది పుత్తూరులోని మండల సముథిరం అటవీ ప్రాంతానికి సమీపంలో ఆగిపోయినట్లు గుర్తించారు. దీంతో ఒక బృందం అటవీ ప్రాంతానికి వెళ్లింది, మరొక బృందం రెడ్డి కాల్ వివరాలను చెక్ చేశాయి. కాల్ డేటా ప్రకారం రెడ్డి చెల్లె కొడుకు రంజిత్ కుమార్ వీరి అదృశ్యానికి ముందు అనేక సార్లు ఫోన్ చేసినట్టు తేలింది. 

తిరుత్తనిలో ఇంటిదగ్గరే స్వీట్ స్టాల్ నడుపుతున్న రంజిత్ కుమార్ ను పోలీసులు విచారించారు. మొదట్లో తనకేం తెలియదు అన్న రంజిత్ కుమార్.. ఆ తరువాత నేరాన్ని అంగీకరించాడు. వారి వద్దనున్న బంగారం, నగదు కోసమే వారిని హత్య చేసి.. వాటిని దొంగిలించినట్లు అంగీకరించాడు. 

రంజిత్ కుమార్ తన స్నేహితుడు విమల్‌రాజ్‌ లను పోలీసులు పుత్తూరుకు తీసుకెళ్లారు, అక్కడ వారు మృతదేహాలను ఖననం చేసిన స్థలాన్ని గుర్తించారు. మృతదేహాలను శవపరీక్ష కోసం తిరుపతిలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. దొంగిలించబడ్డ విలువైన వస్తువులను రికవరీ చేయడానికి ఇద్దరు నిందితులను తిరుత్తనికి తీసుకువస్తున్నారు.
 

click me!