నేడు యూపీలో మోడీ టూర్: రెండు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ప్రారంభించనున్న మోడీ

Published : Jul 07, 2023, 09:31 AM ISTUpdated : Jul 07, 2023, 09:38 AM IST
నేడు యూపీలో  మోడీ టూర్:  రెండు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు ప్రారంభించనున్న మోడీ

సారాంశం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  ఇవాళ  ఉత్తర్ ప్రదేశ్ లో  రెండు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను  ప్రారంభించనున్నారు.గోరఖ్ పూర్, వారణాసిలలో  పలు  కార్యక్రమాల్లో  మోడీ పాల్గొంటారు.

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  శుక్రవారంనాడు  మరో రెండు వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను ప్రారంభించనున్నారు.  ఇవాళ  ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలో  ప్రధాని మోడీ పర్యటిస్తారు.  తన పార్లమెంట్ నియోజకవర్గమైన వారణాసీతో పాటు  గోరఖ్ పూర్ పార్లమెంట్ నియోజకవర్గంలో  మోడీ  పర్యటిస్తారు.  సుమారు రూ. 12 వేల కోట్ల విలువైన  పలు అభివృద్ధి కార్యక్రమాల్లో మోడీ  పాల్గొంటారు.

మరో వైపు  రెండు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లను కూడ మోడీ ప్రారంభించనున్నారు.  భారతీయ రైల్వే శాఖలో  వందే భారత్  రైళ్లు  కొత్త శకానికి నాంది పలికాయనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు.

గోరఖ్ పూర్ రైల్వే స్టేషన్ లోని  ఫ్లాట్ ఫారమ్ నెంబర్ 1 నుండి గోరఖ్ పూర్- లక్నో  వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైలును  మోడీ  ప్రారంభిస్తారు.  మరో వైపు  జోధ్ పూర్  - సబర్మతి  వందే భారత్  ఎక్స్ ప్రెస్ రైలును  మోడీ  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా  ప్రారంభించనున్నారు.  ఈ కార్యక్రమంలో  యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్, యూపీ గవర్నర్ ఆనందిబెన్ పటేల్ సహా  పలువురు మంత్రులు, అధికారులు పాల్గొంటారు. మరో వైపు గోరఖ్ పూర్  రైల్వే స్టేషన్ రీడెవలప్ మెంట్  పనులను మోడీ ప్రారంభిస్తారు.

 

ఇవాళ  సాయంత్రం వారణాసిలో మోడీ పర్యటిస్తారు.  పండిట్ దీన్ దయాల్ ఉపాధ్యాయ జంక్షన్ రైల్వేస్టేషన్ , సోన్ నగర్ మధ్య  కొత్త ఫ్రైట్ కారిడార్, వారణాసి, జౌన్ పూర్ ను కలిపే  నాలుగులైన్ల జాతీయ రహదారి పనులను  మోడీ ప్రారంభించనున్నారు.

ఇవాళ, రేపు  పలు రాష్ట్రాల్లో ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ  పర్యటిస్తున్నారు.  పలు  అభివృద్ధి  కార్యక్రమాల్లో  మోడీ పాల్గొంటున్నారు.  పలు  రాష్ట్రాల్లో ఆయన సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్  స్వంత  నియోజకవర్గం గోరఖ్ పూర్ కు  మోడీ చేరుకుంటారు.  గీతా ప్రెస్ శతాబ్ది ముగింపు  ఉత్సవాల్లో మోడీ పాల్గొంటారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Humans On Moon: చంద్రుడిపై ఇల్లు.. కల కాదు నిజం ! 2025 స్టడీ సంచలనం
PM Surya Ghar Scheme : ఇలా చేశారో విద్యుత్ ఛార్జీలుండవు.. డబ్బులు సేవ్