బలమైన ఆర్ధిక వ్యవస్థకు పునాది: కేంద్ర బడ్జెట్ 2023పై మోడీ

By narsimha lode  |  First Published Feb 1, 2023, 2:55 PM IST

బలమైన ఆర్ధిక వ్యవస్థకు   ఈ బడ్జెట్  పునాదిని వేస్తుందని  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చెప్పారు.   అన్ని వర్గాల  ప్రజలకు  ఈ బడ్జెట్ అనుకూలంగా  ఉందని  మోడీ  అభిప్రాయపడ్డారు.  
 


న్యూఢిల్లీ:  అన్ని వర్గాలకు  బడ్జెట్ అనుకూలంగా  ఉందని   ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ చెప్పారు.బుధవారం నాడు  కేంద్ర బడ్జెట్ 2023పై  ప్రధాని నరేంద్ర మోడీ  స్పందించారు.  గ్రామీణ ప్రజల ఆకాంక్షలకు  అనుగుణంగా బడ్జెట్  రూపకల్పన జరిగిందని  మోడీ తెలిపారు. 

 

This year's Budget infuses new energy to India's development trajectory. https://t.co/lyV2SMgvvs

— Narendra Modi (@narendramodi)

Latest Videos

 పేద, మధ్యతరగతి  ప్జజల కల సాకారం చేసేలా బడ్జెట్ ను రూపొందించినట్టుగా  మోడీ వివరించారు.   ఈ బడ్జెట్  బలమైన  ఆర్ధిక వ్యవస్థకు  పునాది వేస్తుందని  ప్రధాని చెప్పారు.   పేదలు, గ్రామస్తులు, రైతులు, మధ్యతరగతి   ప్రజల కలలను  నెరవేరుస్తుందని   ప్రధాని  మోడీ అభిప్రాయపడ్డారు.  భారత్ కలను  నెరవేర్చడానికి  ఇది బలమైన పునాదిని  వేస్తుందని మోడీ తెలిపారు. ఎంఎస్ఎంఈలు ఇతర రంగాలను  ప్రోత్సహించేందుకు  తీసుకున్న చర్యలను  ఆయన  ప్రశంసించారు.  ప్రధాని నరేంద్ర మోడీ 2023-24  కేంద్ర బడ్జెట్  ను  ప్రధాని మోడీ ప్రశంసించారు.  ఇది అభివృద్ది చెందిన  భారతదేశానికి  సంకల్పాన్ని నెరవేర్చడానికి  పునాదిని  అందించే బడ్జెట్ గా   మోడీ పేర్కొన్నారు.  

click me!