కార్గిల్ యుద్ధభూమిలో మోడీ.. నాటి క్షణాలను గుర్తు చేసుకున్న ప్రధాని

Siva Kodati |  
Published : Jul 26, 2019, 03:00 PM IST
కార్గిల్ యుద్ధభూమిలో మోడీ.. నాటి క్షణాలను గుర్తు చేసుకున్న ప్రధాని

సారాంశం

కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు ప్రధాని నరేంద్రమోడీ నివాళులర్పించారు. విజయ్ దివస్‌ను పురస్కరించుకుని ఆయన ట్వీట్టర్ ద్వారా సందేశాన్ని తెలిపారు. 

కార్గిల్ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన అమరవీరులకు ప్రధాని నరేంద్రమోడీ నివాళులర్పించారు. విజయ్ దివస్‌ను పురస్కరించుకుని ఆయన ట్వీట్టర్ ద్వారా సందేశాన్ని తెలిపారు. యుద్ధంలో వీరోచితంగా పోరాడిన సైనికులకు ప్రధాని వందనాలు సమర్పించారు.

అంతేకాకుండా కార్గిల్ గొప్పతనాన్ని తెలిపేలా ఓ వీడియోను కూడా పోస్ట్ చేశారు. ఈ క్రమంలో కార్గిల్ యుద్ధ సమయంలో సైనికులను కలిసి వారితో గడపటాన్ని ఎప్పటికీ మరచిపోలేనని మోడీ గుర్తు చేసుకున్నారు.

1999లో తాను పార్టీ కోసం జమ్మూకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్‌లో పనిచేస్తున్నానని.. యుద్ధ సమయంలో తనకు కార్గిల్ వెళ్లి..సైనికులను కలిసే అవకాశం వచ్చిందని మోడీ పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాడు సైనికులను కలిసినప్పటి ఫోటోలను ప్రధాని ట్వీట్టర్‌లో పోస్ట్ చేశారు. 

PREV
click me!

Recommended Stories

Makarajyothi: ఘనంగా మకర జ్యోతి ఉత్సవం.. దర్శనానికి పోటెత్తిన లక్షలాది స్వాములు | Asianet News Telugu
Petrol Price : లీటర్ పెట్రోల్ ఏకంగా రూ.200... ఎక్కడో కాదు ఇండియాలోనే..!