ప్రధాని మోదీ తల్లి హీరాబెన్‌కు అస్వస్థత.. ఆస్పత్రికి తరలింపు..

By Sumanth KanukulaFirst Published Dec 28, 2022, 1:55 PM IST
Highlights

ప్రధాన  మంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ అస్వస్థతకు గురయ్యారు.హీరాబెన్ అనారోగ్యానికి గురికావడంతో ఆమెను అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఆసుపత్రిలో చేర్పించారు.

ప్రధాన  మంత్రి నరేంద్ర మోదీ తల్లి హీరాబెన్ మోదీ అస్వస్థతకు గురయ్యారు.హీరాబెన్ అనారోగ్యానికి గురికావడంతో ఆమెను అహ్మదాబాద్‌లోని యుఎన్ మెహతా ఆసుపత్రిలో చేర్పించారు. అయితే హీరాబెన్ మోదీ ఆరోగ్య పరిస్థితికి సంబంధించి యుఎన్ మెహతా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కార్డియాలజీ అండ్ రీసెర్చ్ సెంటర్‌ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఆమె ఆరోగ్యం నిలకడగా ఉందని పేర్కొంది. ప్రధాని మోదీ తల్లి అనారోగ్యానికి గురైందనే వార్త నేపథ్యంలో గుజరాత్‌లో బీజేపీ నాయకులు కొందరు ఆస్పత్రి వద్దకు చేరుకుంటున్నారు.

మరోవైపు ఆస్పత్రి వద్ద భద్రతను కూడా ఏర్పాటు చేశారు. ప్రధాని మోదీ కూడా అహ్మదాబాద్ బయలుదేరి వెళ్లనున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక, ప్రధాని మోదీ తన తల్లిని ఈ నెల ప్రారంభంలో.. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల రెండో విడుత పోలింగ్‌కు ముందు కలిశారు. హీరాబెన్ గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తన ఓటు హక్కును కూడా వినియోగించుకన్నారు.

ఇక, 1923 జూన్ 18న జన్మించిన హీరాబెన్ మోదీ.. ఈ ఏడాది 100వ ఏటా అడుగుపెట్టారు. హీరాబెన్ 100వ పుట్టినరోజు సందర్భంగా ఈ ఏడాది జూన్ 18న మోదీ ఆమెను కలిశారు. తల్లి నుంచి ఆశీస్సులు తీసుకున్నారు. ఆమె కృతజ్ఞతలు తెలుపుతూ ఓ పోస్టు కూడా చేశారు. 
 

click me!