పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. మోడీ నివాసంలో కీలక భేటీ, హాజరైన నడ్డా, అమిత్ షా

Siva Kodati |  
Published : Sep 01, 2023, 09:09 PM IST
పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు.. మోడీ నివాసంలో కీలక భేటీ, హాజరైన నడ్డా, అమిత్ షా

సారాంశం

ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో కీలక భేటీ ముగిసింది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు హాజరయ్యారు. ప్రత్యేక పార్లమెంట్ సమావేశాల సందర్భంగా ఈ సమ ావేశానికి ప్రాధాన్యత సంతరించుకుంది. 

ప్రధాని నరేంద్ర మోడీ నివాసంలో కీలక భేటీ ముగిసింది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర హోంమంత్రి అమిత్ షాలు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో తీసుకోవాల్సిన బిల్లుపై వీరు చర్చించినట్లుగా సమాచారం. ఇకపోతే.. దేశమంతా ఒకే సమయంలో ఎన్నికలకు తాము సిద్దంగా ఉన్నామని కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ సునీల్ ఆరోరా స్పష్టం చేశారు. దేశంలో జమిలి ఎన్నికల విషయమై ప్రధాని నరేంద్ర మోడీ ప్రస్తావించిన నెల రోజుల తర్వాత ఈ విషయమై ఆరోరా స్పందించారు.

సోమవారం నాడు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్ సునీల్ ఆరోరా మీడియాతో మాట్లాడారు. దేశంలోని అన్ని రాష్ట్రాలకు ఒకేసారి ఎన్నికల నిర్వహణకు తాము సిద్దంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. వన్ నేషన్, వన్ పోల్  కోసం ఒకే ఓటర్ జాబితా ఉండాలని మోడీ కోరారు. దేశంలో ప్రతి కొన్ని నెలలకు ఒసారి ఎన్నికలు జరగడం వల్ల అభివృద్ది కార్యక్రమాలపై పడుతోందన్నారు.ప్రతి కొన్ని నెలలకు వేర్వేరు ప్రదేశాలలో ఎన్నికలు జరగడం వల్ల అభివృద్ది పనులకు ఆటకం కలిగే అవకాశం ఉందన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నికపై లోతైన అధ్యయనం చేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

Also Read: జమిలి ఎన్నికలంటే ఏమిటీ? ఈ విధానంతో ప్రయోజనాలు, ప్రతికూలతలు ఏమున్నాయ్?

దేశంలో ఏక కాలంలో ఎన్నికలు నిర్వహించాలనే ఆలోచన కొత్తది కాదు. కానీ దేశంలో ఇతర నాయకుల కంటే మోడీ దీని కోసం ఎక్కువగా ప్రయత్నిస్తున్నారు.2015లో ఈఎం సుదర్శన్ నాచియప్పన్ నేతృృత్వంలోని పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడ ఏక కాలంలో ఎన్నికలకు సిఫారసు చేసిన విషయం తెలిసిందే.

2018లో లా కమిషన్ తన ముసాయిదా నివేదికలో క్యాలెండర్ సంవత్సరంలో అన్ని ఎన్నికలు కలిసి నిర్వహించాలని సిఫారసు చేసింది.కాంగ్రెస్ సహా పలు విపక్ష పార్టీలు ఒకేసారి దేశంలో ఎన్నికల నిర్వహణకు అనుకూలంగా లేవు.ఇది అసాధ్యమైన ఆలోచనగా కాంగ్రెస్ పార్టీ అభిప్రాయపడింది.

ఇకపోతే.. కేంద్రం ఈ నెల 18 నుంచి 22 వరకు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు నిర్వహించనుంది. ప్రత్యక సమావేశాల్లో జమిలి ఎన్నికలకు సంబంధించిన బిల్లును కేంద్రం ప్రవేశపెట్టే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో విపక్షాలు బిల్లుపై ఆందోళన వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిస్ధితుల్లో మోడీ నివాసంలో కీలక భేటీ జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్
ఏకంగా 5 ,000 వేల ఉద్యోగాలే..! : యువతకు బంపరాఫర్