జిల్లాల అభివృద్ధిపై ప్ర‌ధాని మోడీ వీడియో కాన్ఫ‌రెన్స్

By Rajesh KFirst Published Jan 22, 2022, 2:54 PM IST
Highlights

PM Modi: దేశంలోని వెనకబడ్డ జిల్లాల అభివృద్ధిపై, ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల అమలు పురోగతి, ప్రస్తుత స్థితిగతులపై ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ ఈరోజు వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు. ఈ వీడియో కాన్ఫ‌రెన్స్ లో ప‌లు రాష్ట్రాలకు చెందిన ముఖ్యమంత్రులు, ఆయా రాష్ట్రాల లెఫ్టినెంట్‌ గవర్నర్లు, అధికారులు పాల్గొన్నారు. నీతి ఆయోగ్ ఆధ్వ‌ర్యంలో ఈ వీడియో కాన్ఫ‌రెన్స్ జ‌రిగింది.
 

PM Modi:  ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ శనివారం (జనవరి 22) దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన జిల్లా మేజిస్ట్రేట్‌లతో కీలక ప్రభుత్వపథకాల అమలుపై సంభాషించారు. సుపరిపాలనలో జిల్లా పాలనా యంత్రాంగం  కీల‌క‌మ‌ని, పథకాలను మరింత మెరుగైన రీతిలో అమలు చేయడానికి ఇది ప్రభుత్వానికి సహాయపడుతుంది. క్షేత్ర సందర్శనలు మరియు తనిఖీల కోసం వివరణాత్మక మార్గదర్శకాలను రూపొందించాలని ప్రధాని మోదీ అన్నారు.
 
కీలకమైన ప్రభుత్వ పథకాల అమలుపై దేశవ్యాప్తంగా ఉన్న జిల్లా మేజిస్ట్రేట్లతో ప్రధాని నరేంద్ర మోదీ సంభాషించారు. దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఉన్న అడ్డంకులను తొలగించాల‌ని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. కీలకమైన ప్రభుత్వ పథకాల అమలులో జిల్లా మేజిస్ట్రేట్ పాత్ర కీల‌కమ‌ని, కేంద్రం, రాష్ట్రాలు మ‌ధ్య  జిల్లా మేజిస్ట్రేట్ కీల‌క‌మ‌ని అన్నారు. స్థానిక పరిపాలన యొక్క‌ టీమ్‌వర్క్ ఆశించిన జిల్లాలలో మంచి ఫలితాలను ఇస్తోందని అన్నారు.

సుపరిపాలనలో జిల్లా పాలనా యంత్రాంగాల ప్రాముఖ్యతను ఎత్తిచూపిన ప్రధాని, పథకాలను మరింత మెరుగైన రీతిలో అమలు చేసేందుకు ప్రభుత్వానికి ఇది దోహదపడుతుందని అన్నారు. క్షేత్రస్థాయి పర్యటనలు మరియు తనిఖీల కోసం అధికారులు వివరణాత్మక మార్గదర్శకాలను రూపొందించాలని కూడా ఆయన సూచించారు.  గత నాలుగేళ్లలో దాదాపు ప్రతి జిల్లాలో ‘జన్ ధన్’ ఖాతాలు నాలుగు నుంచి ఐదు రెట్లు పెరిగాయని ప్రధాని మోదీ అన్నారు.

“దాదాపు ప్రతి కుటుంబానికి మరుగుదొడ్డి ఉంది, ప్రతి గ్రామానికి విద్యుద్దీకరించబడింది. విద్యుత్తు పేదల ఇళ్లకు చేరడమే కాకుండా ప్రజల్లో ఆదాయ మార్గాలు మెరుగుప‌డ్డాయ‌ని ప్ర‌ధాని మోడీ అన్నారు.  
 

click me!