క‌ర్త‌వ్యప‌థ్‌గా మారిన రాజ్‌‌ప‌థ్‌... నేతాజీ విగ్ర‌హాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోడీ

By Siva KodatiFirst Published Sep 8, 2022, 8:10 PM IST
Highlights

దేశ రాజధాని న్యూఢిల్లీలోని చారిత్రక రాజ్‌పథ్.. నేటి నుంచి కర్తవ్యపథ్‌గా మారింది. రాజ్‌ప‌థ్‌కు మ‌రిన్ని అధునాత‌న సౌక‌ర్యాల‌ను చేరుస్తూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్ర‌భుత్వం మ‌రింత సుంద‌రంగా తీర్చిదిద్దిన సంగ‌తి తెలిసిందే.
 

దేశ రాజ‌ధాని ఢిల్లీలో పార్ల‌మెంటు, రాష్ట్రప‌తి భ‌వ‌న్, ఇండియా గేట్‌ ప‌రిస‌రాల్లో ఇన్నాళ్లు రాజ్‌ప‌థ్‌గా కొన‌సాగిన చారిత్రక నిర్మాణం గురువారం క‌ర్త‌వ్య ప‌థ్‌గా మారింది. రాజ్‌ప‌థ్‌కు మ‌రిన్ని అధునాత‌న సౌక‌ర్యాల‌ను చేరుస్తూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్ర‌భుత్వం మ‌రింత సుంద‌రంగా తీర్చిదిద్దిన సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా క‌ర్త‌వ్య ప‌థ్‌లోనే 25 అడుగుల ఎత్తైన నేతాజీ సుభాష్ చంద్ర బోస్ విగ్ర‌హాన్ని కూడా ఏర్పాటు చేశారు. గురువారం 
నేతాజీ విగ్ర‌హాన్ని ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ ఆవిష్కరించారు. అలాగే క‌ర్త‌వ్య ప‌థ్‌ను కూడా ఆయన లాంఛ‌నంగా ప్రారంభోత్స‌వం చేశారు. అయితే ఖ‌మ్మం జిల్లాలో దొరికే గ్రానైట్‌తో నేతాజీ విగ్ర‌హాన్ని ప్ర‌ముఖ శిల్పి అరుణ్ యోగ‌రాజ్ రూపొందించారు. తద్వారా దేశంలోని అత్యంత ఎత్తైన ఏక‌శిలా విగ్ర‌హాల జాబితాలో నేతాజీ విగ్ర‌హం కూడా చేరిపోయింది. 

రాజ్‌పథ్ రివ్యాంప్ ఎందుకు..?

కొన్నాళ్లుగా రాజ్‌పథ్, దాన్ని ఆనుకుని ఉన్న సెంట్రల్ విస్టా అవెన్యూకు పర్యాటకుల తాకిడి పెరుగుతున్నది. పబ్లిక్ టాయిలెట్లు, డ్రింకింగ్ వాటర్, స్ట్రీట్ ఫర్నీచర్, సరిపడా పార్కింగ్ స్థలం వంటి ప్రాథమిక వసతులూ ఇక్కడ లేవు. వీటిని భర్తీకి రీవ్యాంప్ చేశారు. జాతీయ స్థాయి కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు ఎలాంటి అవాంతరాలు రాకుండా చేయడమే దీని లక్ష్యంగా ఉన్నది. 

ALso Read:కర్తవ్యపథ్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ.. రాజ్‌పథ్‌లో మార్పులు ఇవే

ఈ ఏడాది జనవరి 23న జరుపుకున్నపరాక్రమ్ దివాస్ రోజున ప్రధాని నరేంద్ర మోడీ ఇండియా గేట్ దగ్గర నేతాజీ సుభాష్ చంద్రబోస్ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తాజాగా, గ్రానైట్‌తో ఏకశిలా నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించారు. 28 అడుగుల ఎత్తైన ఈ విగ్రహం సుమారు 65 మెట్రిక్ టన్నుల బరువు ఉంటుంది.

click me!