స్టాలిన్‌కు ప్రధాని మోడీ ఫోన్.. కరుణానిధి ఆరోగ్యంపై ఆరా

First Published Jul 27, 2018, 1:04 PM IST
Highlights

అనారోగ్యంతో అస్వస్థతకు గురైన డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యంపై ప్రధాని నరేంద్రమోడీ ఆరా తీశారు. కరుణ కుమారుడు స్టాలిన్‌కు ఫోన్ చేసిన మోడీ.. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.

అనారోగ్యంతో అస్వస్థతకు గురైన డీఎంకే అధ్యక్షుడు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి ఆరోగ్యంపై ప్రధాని నరేంద్రమోడీ ఆరా తీశారు. కరుణ కుమారుడు స్టాలిన్‌కు ఫోన్ చేసిన మోడీ.. ఆయన ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. ఈ విషయాన్ని మోడీ ట్వీట్టర్‌లో తెలిపారు..

‘‘కరుణానిధి ఆరోగ్య పరిస్థితిపై ఆయన కుమారుడు స్టాలిన్, కుమార్తె కనిమొళిలతో మాట్లాడానని.. కేంద్రం తరపున ఎలాంటి సాయం కావాలన్నా చేసేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పానని.. కరుణానిధి త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నట్లు’’ ప్రధాని ట్వీట్ చేశారు.

మూత్రనాళ ఇన్‌ఫెక్షనన్‌తో బాధపడుతున్న కరుణానిధికి ప్రస్తుతం గోపాలపురంలోని ఆయన నివాసంలోనే ప్రత్యేక వైద్య సిబ్బంది చికిత్స అందిస్తున్నారు...కలైంజర్ ఆరోగ్యం విషమించిందంటూ సోషల్ మీడియాలో వార్తలు వస్తుండటంతో ఆయన అభిమానులు, డీఎంకే కార్యకర్తలు కరుణ నివాసానికి భారీ సంఖ్యలో చేరుకుంటున్నారు. అయితే కుటుంబసభ్యులు ఈ వార్తలను కొట్టిపారేశారు.

click me!