శ్రీలంకలో పేలుళ్లు: మోడీ దిగ్భ్రాంతి, అండగా ఉంటామని హామీ

By Siva KodatiFirst Published Apr 21, 2019, 2:17 PM IST
Highlights

శ్రీలంక రాజధాని కొలంబో సహా ఇతర ప్రాంతాల్లో సంభవించిన పేలుళ్లను భారత ప్రధాని నరేంద్రమోడీ ఖండించారు.

శ్రీలంక రాజధాని కొలంబో సహా ఇతర ప్రాంతాల్లో సంభవించిన పేలుళ్లను భారత ప్రధాని నరేంద్రమోడీ ఖండించారు. ఈ ప్రాంతంలో హింసాత్మక ఘటనలు జరగకుండా చూస్తామని... ఈ సమయంలో శ్రీలంక ప్రజలకు భారత్ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.

బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. అటు బెంగాల్ సీఎం మమతా బెనర్జీ కూడా పేలుళ్ల ఘటనను స్పందించారు. శాంతికి ప్రతీకయైన ఈస్టర్ పర్వదినం నాడు ఇటువంటి ఘటన చోటు చేసుకోవడం విచారకరమని ఆమె ట్వీట్ చేశారు.

మరోవైపు కాంగ్రెస్ పార్టీ కూడా ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేసింది. ఈ క్లిష్ట సమయంలో శ్రీలంక ప్రభుత్వానికి, ప్రజలకు భారత ప్రజలు అండగా ఉంటారని వ్యాఖ్యానించింది. 

click me!