presidential election : ప్రారంభమైన బీజేపీ పార్లమెంటరీ బోర్డ్ భేటీ.. రాష్ట్రపతి అభ్యర్ధిని ఖరారు చేసే ఛాన్స్

By Siva KodatiFirst Published Jun 21, 2022, 8:00 PM IST
Highlights

రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ అయ్యింది. విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా పేరు ఖరారైన నేపథ్యంలో.. ఎన్డీయే అభ్యర్ధిపైనా ఈ సమావేశంలో స్పష్టత వచ్చే అవకాశం వుంది. 
 

రాష్ట్రపతి ఎన్నిక నేపథ్యంలో ఢిల్లీలో బీజేపీ పార్లమెంటరీ బోర్డు భేటీ అయ్యింది. ఈ సమావేశానికి ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తదితర నేతలు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్ధిని ఖరారు చేసే అవకాశం వుంది. రాష్ట్రపతి అభ్యర్ధి ఎంపిక కోసం  కేంద్ర మంత్రులు, ముగ్గురు ప్రధాన కార్యదర్శులతో పాటు మరో 14 మంది కీలక నేతలతో బీజేపీ కమిటీని ఏర్పాటు చేసింది.  ఈ కమిటీతో జేపీ నడ్డా ఆదివారం నాడు భేటీ అయ్యారు. 

అంతకుముందు ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడితో కేంద్ర హోంశాఖ మంత్రి Amit Shah , రక్షణ మంత్రి రాజ్ నాథ్ సింగ్ బీజేపీ జాతీయ అధ్యక్షుడు JP Nadda మంగళవారం నాడు భేటీ అయ్యారు. Hyderabad లో జరిగిన Yoga Day లో పాల్గొన్న ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు హుటాహుటిన ఢిల్లీకి వెళ్లారు. రాష్ట్రపతి ఎన్నికల నేపథ్యంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నివాసంలో ఇవాళ ఉదయం సమావేశం జరిగింది. ఈ సమావేశం ముగిసిన తర్వాత  జేపీ నడ్డా, అమిత్ , రాజ్షా నాథ్లు సింగ్ లు Vice Preident తో భేటీ అయ్యారు. వెంకయ్యనాయుడిని రాష్ట్రపతి అభ్యర్ధిగా బరిలోకి దింపుతారా, లేదా ఉపరాష్ట్రపతిగా ఆయనకు మరోసారి చాన్స్ ఇస్తారా అనే విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ALso Read:Presidential Election: విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థిగా యశ్వంత్ సిన్హా.. అధికారిక ప్రకటన

ఇకపోతే.. విపక్షాల ఉమ్మడి రాష్ట్రపతి అభ్యర్థిగా కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హా పేరు ఖరారు అయింది. మంగళవారం జరిగిన విపక్ష పార్టీల సమావేశంలో ఏకగ్రీవంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. విపక్షాల నిర్ణయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ అధికారికంగా ప్రకటించారు. ‘‘రాష్ట్రపతి ఎన్నికలకు ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హా అని మేం (ప్రతిపక్ష పార్టీలు) ఏకగ్రీవంగా నిర్ణయించాం’’ అని జైరాం రమేష్ తెలిపారు. ఇక, జూన్ 27న ఉదయం 11.30 గంటలకు యశ్వంత్ సిన్హా నామినేషన్ దాఖలు చేయనున్నారు.
 

click me!