భారత సైనికుల త్యాగాలు వెలకట్టలేనివి: మన్‌కీ బాత్‌లో మోడీ

By narsimha lodeFirst Published Jun 28, 2020, 3:32 PM IST
Highlights

లద్దాఖ్‌లో ప్రాణాలు కోల్పోయిన అమర వీరుల త్యాగాలను దేశం ఎప్పటికి గుర్తుంచుకొంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  చెప్పారు.
 

న్యూఢిల్లీ: లద్దాఖ్‌లో ప్రాణాలు కోల్పోయిన అమర వీరుల త్యాగాలను దేశం ఎప్పటికి గుర్తుంచుకొంటుందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  చెప్పారు.

ఆదివారం నాడు  మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని మోడీ  దేశ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు.  గాల్వన్ ఘటనలో తమ వారిని  కోల్పోయిన కుటుంబాలు దేశ సేవ కోసం తమ పిల్లలను కూడ పంపాలని కోరుకొంటున్నాయని ఆయన  చెప్పారు.

బీహార్ కు చెందిన అమరవీరుడు కుందన్ కుమార్ తండ్రి దేశాన్ని కాపాడేందుకు తన మనవడిని కూడ సైన్యంలోకి పంపుతామని చెప్పారని ఆయన గుర్తు చేశారు. 

ప్రతి అమరవీరుడి కుటుంబంలో ఇదే స్పూర్తిని నెలకొందన్నారు. ఆ కుటుంబాల త్యాగాలు మరువలేనివిగా ఆయన చెప్పారు. భారత్ ను స్వావలంబన దేశంగగా మార్చాలని ఎందరో లేఖలు రాస్తున్నారని ఆయన గుర్తు చేశారు.

సరిహద్దు వివాదంలో చైనా దూకుడుకు ధీటుగా బదులిచ్చినట్టుగా  ఆయన తెలిపారు. డ్రాగన్ సేనలతో వీరోచితంగా పోరాటం చేసిన ఇండియా సైనికుల త్యాగాలను ఆయన ఈ సందర్భంగిా కొనియాడారు. 

స్థానిక ఉత్పత్తుల వాడకానికే మొగ్గు చూపాలన్నారు. సవాళ్లను అవకాశాలుగా మలుచుకొంటూ  రక్షణ, సాంకేతిక రంగాల్లో భారత్ బలోపేతం అవుతోందన్నారు.

ఈ ఏడాది ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయయన్నారు. వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. ప్రపంచమంతా వ్యాధి నిరోధకశక్తిని పెంచుకోవడంపై దృష్టి కేంద్రీకరించగా ఇమ్యూనిటీని పెంచేవన్నీ భారత్ లో ఎప్పటి నుండే వాడుతున్నవేనన్నారు.

click me!