: దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందుతున్న తరుణంలో నిబంధనలను కూడ పాటించడం లేదు. మరోవైపు కొందరు నిబంధనలు పాటించని వారిపై జరిమానా విధిస్తున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన ఓ కుటుంబానికి రూ. 6 లక్షల జరిమానాను విధించారు కలెక్టర్.
జైపూర్: దేశ వ్యాప్తంగా కరోనా వ్యాప్తి చెందుతున్న తరుణంలో నిబంధనలను కూడ పాటించడం లేదు. మరోవైపు కొందరు నిబంధనలు పాటించని వారిపై జరిమానా విధిస్తున్నారు. రాజస్థాన్ రాష్ట్రంలో కోవిడ్ నిబంధనలను ఉల్లంఘించిన ఓ కుటుంబానికి రూ. 6 లక్షల జరిమానాను విధించారు కలెక్టర్.
రాజస్థాన్ బిల్వారా జిల్లాకు చెంందిన గీసులాల్ రాఠీ ఈ నెల 13వ తేదీన తన కొడుకు పెళ్లి జరిపించాడు. పెళ్లికి కేవలం 50 మంది అతిథులను మాత్రమే ఆహ్వానించాలనే నిబంధన ఉంది.
అయితే ఈ నిబంధనలను ఖాతరు చేయలేదు. భారీ సంఖ్యలో పెళ్లికి ఆహ్వానించారు. అనంతరం ఈ వేడుకకు హాజరైన వారిలో 15 మందికి కూడ కరోనా సోకింది. వీరిలో ఒకరు తీవ్ర అనారోగ్య లక్షణాలతో చనిపోయాడు.
ఈ ఘటనకు కారణమైన గీసులాల్ రాఠీపై పోలీసులు ఈ నెల 22వ తేదీన కేసు నమోదు చేశారు.అంతేకాదు ఆ కుటుంబానికి రూ. 6 లక్షల 26 వేల 600 జరిమానా విధించారు. ఈ డబ్బులను సీఎం సహాయ నిధికి అందించాలని కలెక్టర్ ఆదేశించారు.