ఇదే టీమ్ ఇండియా స్ఫూర్తి : సహకార ఫెడరలిజం బలోపేతమే లక్ష్యంగా మోడీ నిరంతర యత్నాలు

By Siva KodatiFirst Published Sep 22, 2022, 9:16 PM IST
Highlights

కేంద్రం, రాష్ట్రాల మధ్య సత్సంబంధాలను పెంపొందించేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అధికారం చేపట్టిన నాటి నుంచి ప్రయత్నిస్తూనే వున్నారు. కరోనాతో పాటు పలు సందర్భాల్లో ఆయన తన నిబద్ధతను చాటుకున్నారు. 

రేపు అన్ని రాష్ట్రాల పర్యావరణ మంత్రుల జాతీయ కాన్ఫరెన్స్‌ను వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని మోడీ ప్రారంభించనున్నారు. రాష్ట్ర విధాన నిర్ణేతలతో ఇటువంటి జాతీయ సమావేశాలలో ప్రధాన మంత్రి పాల్గొనడం ద్వారా సహకార సమాఖ్య, ‘టీమ్ ఇండియా’ స్పూర్తిని పెంపొందిస్తుందని నిపుణులు అంటున్నారు. 

ఈ తరహా కార్యక్రమాల్లో ప్రధాని పాల్గొన్న కొన్ని ఉదాహరణలు:

  • పదిహేను రోజు క్రితం సెప్టెంబర్ 10న అహ్మాదాబాద్‌లో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ‘సెంటర్ స్టేట్ సైన్స్ కాన్‌క్లేవ్‌’ను ప్రధాని మోడీ ప్రారంభించారు.
  • ఆగస్ట్ 25న అన్ని రాష్ట్రాలు , కేంద్రపాలిత ప్రాంతాల కార్మిక శాఖ మంత్రులతో జాతీయ కార్మిక సదస్సులో ప్రధాని ప్రసంగించారు.
  • జూన్ 16న రెండు రోజుల పాటు జరిగిన చీఫ్ సెక్రటరీల జాతీయ సదస్సులో పాల్గొనేందుకు ప్రధాని మోడీ ధర్మశాలకు వెళ్లారు. ఈ తరహా సమావేశం జరగడం ఇదే తొలిసారి. విధివిధానాలను మరింత మెరుగ్గా అమలు చేయడం కోసం దేశంలోని సీనియర్ అధికారులతో ప్రధాని తన ఆలోచనలు పంచుకున్నారు
  • ఏప్రిల్ 30న రాష్ట్రాల సీఎంలు, హైకోర్టు ప్రధాన న్యాయమూర్తుల సంయుక్త సమావేశాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. 


కోవిడ్ సమయంలో రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సీఎంలతో సమయానుకూలంగా సమావేశాలు నిర్వహించడం ద్వారా టీమ్ ఇండియా స్పూర్తిని ప్రధాని పెంపొందించారు. మార్చి 2020 నుంచి ఏప్రిల్ 2022 వరకు అలాంటి ఇరవై సమావేశాలకు ప్రధాని మోడీ అధ్యక్షత వహించారు. శతాబ్ధానికి ఒకసారి వచ్చే మహమ్మారి ద్వారా ఎదురయ్యే సవాలును కేంద్రం, రాష్ట్రాల సమన్వయంతోనే ఎదుర్కొనగలమని మోడీ విశ్వసించారు. ప్రపంచంలోనేప అతిపెద్ద కోవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని విజయవంతంగా అమలు చేయడంలోనూ ఈ సమన్వయం ఉపయోగపడింది. 

అలాగే వార్షిక డీజీపీ/ ఐజీపీ సమావేశాలపైనా ప్రధాని నరేంద్ర మోడీ ఆసక్తిని కనబరిచారు. 2014 నుంచి నిర్వహిస్తూ వస్తోన్న ప్రతి సమావేశానికి హాజరయ్యేలా చూసుకున్నారు. 2014కి ముందు ఢిల్లీలో ఆనవాయితీగా నిర్వహిస్తూ వస్తున్న వార్షిక సదస్సులు ఇప్పుడు దేశవ్యాప్తంగా నిర్వహించబడుతున్నాయి. 2020లో ఇది వీడియో కాన్ఫరెన్స్ ద్వారా నిర్వహించబడగా.. 2014లో గౌహతిలో... 2015లో ధోర్డో, రాన్ ఆఫ్ కచ్.. 2016లో నేషనల్ పోలీస్ అకాడమీ , హైదరాబాద్... 2017లో బీఎస్ఎఫ్ అకాడమీ, టేకాన్‌పూర్... 2018లో కేవడియా... 2019లో పూణే... 2021లో లక్నోలో జరిగింది. 

టీమిండియాలో వాటాదారుల పెంపు ద్వారా విధానపరమైన విషయాలపై జాతీయ దృక్పథాన్ని అభివృద్ది అభివృద్ది చేయడం ప్రధాని మోడీ నిబద్ధతకు మరొక ఉదాహరణ. గడిచిన ఎనిమిదేళ్లలో ప్రధాని మోడీ... నీతి ఆయోగ్ ఏడు పాలక మండలి సమావేశాలకు అధ్యక్షత వహించారు. అలాగే జాతీయ గవర్నర్ల సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా జాతీయ అభివృద్దికి హామీ ఇవ్వడంతో పాటు సామాన్యుల అవసరాలను తీర్చడంపై పునరుద్ఘాటించారు. 

వీటితో పాటు రైతుల ఆదాయాన్ని మెరుగుపరచడం, మహిళల అభివృద్ది, పర్యాటకం, సంస్కృతి, క్రీడలు, ఈ గవర్నెన్స్ మొదలైన విభినన అంశాలపై జాతీయ సదస్సులలో ప్రధాని మోడీ పాల్గొన్న సందర్భాలు కోకొల్లలు. 

వీటిలో కొన్ని ఉదాహరణలు :

  • వ్యవసాయం- 2022: రైతుల ఆదాయాలను రెట్టింపు చేయడంపై జాతీయ సదస్సు
  • గ్యాంగ్‌టక్‌లో సుస్ధిర వ్యవసాయం, రైతుల సంక్షేమంపై జాతీయ సమావేశం (2016)
  • పార్లమెంట్ సెంట్రల్ హాల్‌లో జాతీయ శాసనసభ్యుల సమావేశం (2018)
  • కేంద్ర, రాష్ట్ర మంత్రులతో పాటు సంస్కృతి, పర్యాటకం, క్రీడల శాఖ కార్యదర్శులతో జాతీయ సమావేశం (2015)
  • ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ (2015)
  • ఈ గవర్నెన్స్‌పై జాతీయ సమావేశం (2015)
click me!