24 గంటల్లో ఇండియాలో 13,586 కరోనా కేసులు: కోవిడ్‌తో12,573 మంది మృతి

By narsimha lode  |  First Published Jun 19, 2020, 10:18 AM IST

గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 13,586కి చేరుకొన్నాయి. దీంతో కరోనా కేసులు మొత్తం 3,80,532కి చేరుకొన్నాయి. ఇందులో 1,63,248 యాక్టివ్ కేసులుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.


న్యూఢిల్లీ: గత 24 గంటల్లో దేశ వ్యాప్తంగా కరోనా కేసులు 13,586కి చేరుకొన్నాయి. దీంతో కరోనా కేసులు మొత్తం 3,80,532కి చేరుకొన్నాయి. ఇందులో 1,63,248 యాక్టివ్ కేసులుగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

ఇప్పటివరకు 2,04,711 మంది కరోనా నుండి కోలుకొన్నారు. మరో వైపు కరోనాతో ఇప్పటికి దేశంలో 12,573  మంది మృత్యువాత పడ్డారు.కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి హర్షవర్ధన్  మొబైల్ కరోనా పరీక్షల లాబోరేటరీని ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ఈ మొబైల్ లాబోరేటరీని ఉపయోగించనున్నారు.

Latest Videos

undefined

ఆటోమెటిక్ కోచ్ వాషింగ్ ప్లాంట్ ను వడోదరలో ప్రారంభించారు. రైల్వే కోచ్ లను పది నిమిషాల్లో ఈ మిషన్ బయటి నుండి క్లీన్ చేయనుంది. రీసైక్లింగ్ చేసే నీటినే దీని కోసం ఉపయోగించనున్నారు.

also read:ప్రపంచంలో నాలుగో స్థానానికి ఎగబాకిన ఇండియా: మొత్తం 3,66,946కి చేరిన కరోనా కేసులు

ముంబైలో 1298 కరోనా కేసులు నిన్న నమోదయ్యాయి. నిన్న ఒక్క రోజే 67 మంది మరణించారు. మహారాష్ట్రలో కరోనా కేసులు 62,799కి చేరుకొన్నాయి. కరోనాతో రాష్ట్రంలో 3,309 మంది మరణించారు.

హర్యానా రాష్ట్రంలోని అంబాలాలో 29 మందికి కరోనా సోకింది. అంబాలలో కరోనా కేసుల సంఖ్య 237కి చేరుకొంది. ఇందులో 122 యాక్టివ్ కేసులు.ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని గౌతమ్ బుద్దనగర్  లో 16 మంది కరోనాతో మరణించారు. నిన్న ఒక్క రోజే ఈ జిల్లాలో మరో ఇద్దరు మరణించారు. కరోనా కేసులు 1,171కి చేరుకొన్నాయి.

ఢిల్లీలో 2877 కరోనా కేసులు నమోదయ్యాయి. రాష్ట్రంలో కరోనా కేసులు 49 వేలకి చేరుకొన్నాయి. రాష్ట్రంలో కరోనాతో 1969 మంది మరణించారు.కరోనా రోగుల కేసుల్లో ప్రపంచంలో ఇండియా నాలుగో స్థానానికి చేరుకొంది. 

click me!