ఈశాన్య భారతంపై ‘‘డెల్టా’’ ప్లస్ పంజా: రేపు సీఎంలతో ప్రధాని మోడీ భేటీ

By Siva KodatiFirst Published Jul 12, 2021, 4:07 PM IST
Highlights

దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కాస్తంత తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ఈశాన్య భారతంలో కేసులు విపరీతంగా పెరుగుతున్నారు. ముఖ్యంగా డెల్టా ప్లస్ వేరియెంట్ పలు రాష్ట్రాల్లో ఉద్ధృతంగా వుంది. 
 

ఈశాన్య రాష్ట్రాల్లో కరోనా వైరస్ ఉద్ధృతి పెరుగుతోన్న నేపథ్యంలో.. మంగళవారం ప్రధాని మోడీ అక్కడి తాజా పరిస్థితిని సమీక్షించనున్నారు. రేపు ఉదయం 11 గంటలకు అస్సాం, నాగాలాండ్, త్రిపుర, సిక్కిం, మణిపూర్, మేఘాలయా, అరుణాచల్ ప్రదేశ్, మిజోరం రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రధాని భేటీ కానున్నారు.  

ఇటీవల ఈశాన్య రాష్ట్రాలైన మణిపూర్, అరుణాచల్ ప్రదేశ్‌, త్రిపురలో కరోనా కేసులు భారీగా పెరుగుతున్నట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. త్రిపురలో ప్రమాదకర డెల్టా ప్లస్ వేరియంట్ విజృంభిస్తున్నట్లు గణాంకాలు వెల్లడించాయి. ఆ రాష్ట్రాల్లో ‘ఆర్‌ ఫ్యాక్టర్’ ఒకటికి మించి ఉండటం ఆందోళనకరమని చెన్నైలోని ‘ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేథమేటికల్‌ సైన్సెస్’ పరిశోధకుల బృందం హెచ్చరించింది. ఆర్‌ ఫ్యాక్టర్ 1 దాటిపోతే కరోనా మరింత ఉద్ధృతమయ్యే ప్రమాదం ఉంటుందని నిపుణులు తెలిపారు.

Also Read:కరోనా వైరస్ : కొత్తగా 37వేల కేసులు.. 724 మరణాలు..

మరోవైపు..ఇప్పటికే థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందని రోజుకొక అధ్యయనం ప్రజలను భయపెడుతోంది. లాక్‌డౌన్ ఆంక్షలను దశలవారీగా ఎత్తివేయడంతో దేశవ్యాప్తంగా పర్యాటక ప్రాంతాలు, ఆధ్యాత్మిక ప్రదేశాల్లో జనాల రద్దీ పెరిగింది. దీనిపై సర్వత్రా ఆందోళన వ్యక్తం అవుతోంది. రెండో దశ విజృంభణ ఇంకా పూర్తిగా ముగియలేదని.. ప్రజలంతా కొవిడ్ నియమాలు తప్పనిసరిగా పాటించాలని కేంద్రం విజ్ఞప్తి చేస్తోంది. 

click me!