కర్తవ్యపథ్‌ను ప్రారంభించనున్న ప్రధాని మోడీ.. రాజ్‌పథ్‌లో మార్పులు ఇవే

By Mahesh KFirst Published Sep 8, 2022, 12:06 AM IST
Highlights

ప్రధాని నరేంద్ర మోడీ గురువారం సాయంత్రం కర్తవ్యపథ్‌ను ప్రారంభిస్తారు. రాజ్‌పథ్‌ను అవసరాలకు తగినట్టు రీవ్యాంప్ చేశారు. అలాగే, ఇండియా గేట్ దగ్గర నేతాజీ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరిస్తారు.
 

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గురువారం సాయంత్రం కర్తవ్యపథ్ (ఇప్పటి వరకు రాజ్‌పథ్ అని పిలిచారు) ప్రారంభించనున్నారు. ఢిల్లీలో రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు ఉన్న ఈ స్ట్రెచ్‌ను రివ్యాంప్ చేశారు. రూపంలో మార్పులు తెచ్చి ప్రజలకు చెందిన కర్తవ్యపథంగా రాజ్‌పథ్‌ను మార్చినట్టు నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు ఈ స్ట్రెచ్ వెంట ఎర్రటి మార్బుల్‌తో బాటలు, పునరుద్ధరించబడిన కెనాళ్లు, వేర్వేరు రాష్ట్రాల్లో లభించే వంటకాలు ఆఫర్ చేసే స్టాళ్లు, వెండింగ్ కియోస్క్‌లు వెలుస్తున్నాయి. ఇదంతా హరిత రంగులో విలసిల్లుతున్న చెట్లతోపాటుగా ఉన్నాయి.

ఇండియా గేట్ దగ్గర ప్రధాని నరేంద్ర మోడీ నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తారు. దేశ 75 స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో భాగంగా ఎర్రకోట మీది నుంచి ప్రధాని నరే్ంద్ర మోడీ జాతిని ఉద్దేశించి మాట్లాడుతూ భారత దేశ అమృత కాలం కోసం ఐదు ఆజ్ఞలను  పేర్కొన్న సంగతి తెలిసిందే. వలసవాద ఆలోచనల ధోరణులను నిర్మూలించే క్రమంలో భాగంగా ఈ ఐదు ఆజ్ఞలను చూడాలి. ఈ ఆజ్ఞల వెలుగులోనే ఇండియా గేట్ దగ్గర నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆవిష్కరించి వలసవాదుల అవశేషాలనూ నిర్మూలించనున్నారు.

రాజ్‌పథ్ రివ్యాంప్ ఎందుకు?
కొన్నాళ్లుగా రాజ్‌పథ్, దాన్ని ఆనుకుని ఉన్న సెంట్రల్ విస్టా అవెన్యూకు పర్యాటకుల తాకిడి పెరుగుతున్నది. పబ్లిక్ టాయిలెట్లు, డ్రింకింగ్ వాటర్, స్ట్రీట్ ఫర్నీచర్, సరిపడా పార్కింగ్ స్థలం వంటి ప్రాథమిక వసతులూ ఇక్కడ లేవు. వీటిని భర్తీకి రీవ్యాంప్ చేశారు. జాతీయ స్థాయి కార్యక్రమాలు నిర్వహిస్తున్నప్పుడు ఎలాంటి అవాంతరాలు రాకుండా చేయడమే దీని లక్ష్యంగా ఉన్నది. 

ఈ ఏడాది జనవరి 23న జరుపుకున్నపరాక్రమ్ దివాస్ రోజున ప్రధాని నరేంద్ర మోడీ ఇండియా గేట్ దగ్గర నేతాజీ సుభాష్ చంద్రబోస్ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆవిష్కరించారు. తాజాగా, గ్రానైట్‌తో ఏకశిలా నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహాన్ని ఆయన ఆవిష్కరించబోతున్నారు. 28 అడుగుల ఎత్తైన ఈ విగ్రహం సుమారు 65 మెట్రిక్ టన్నుల బరువు ఉంటుంది.

click me!