ఢిల్లీ మెట్రోలో మోడీ ప్రయాణం: ప్రయాణీకులతో నవ్వుతూ సంభాషణ

Published : Jun 30, 2023, 11:15 AM ISTUpdated : Jun 30, 2023, 11:27 AM IST
ఢిల్లీ మెట్రోలో  మోడీ ప్రయాణం: ప్రయాణీకులతో  నవ్వుతూ సంభాషణ

సారాంశం

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  ఢిల్లీ మెట్రో రైలులో ప్రయాణం చేశారు.  ఢిల్లీ యూనివర్శిటీ శతాబ్ది ఉత్సవాలకు  మెట్రో రైలులో  మోడీ  ప్రయాణించారు.

న్యూఢిల్లీ:  ఢిల్లీ యూనివర్శిటీ  శతాబ్ది ఉత్సవంలో పాల్గొనేందుకు  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  శుక్రవారంనాడు  మెట్రో రైలులో ప్రయాణించారు.  
కట్టుదిట్టమైన  భద్రత నేపథ్యంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  తన కార్డును స్వైప్ చేసి మెట్రోరైలులో ప్రయాణించారు.

ఢిల్లీ యూనివర్శిటీ  శతాబ్ది ఉత్సవాలకు  వెళ్లేందుకు  ప్రధానమంత్రి నరేంద్ర మోడీ  మెట్రో రైలులో ప్రయాణించారు. మెట్రో రైలులోని తోటి ప్రయాణీకులతో  ప్రధానమంత్రి  నవ్వుతూ  మాట్లాడారు.  ప్రధానమంత్రి సాధారణ ప్రయాణీకుడిగా  మెట్రో రైలులో  ప్రయాణం చేయడాన్ని  రైలులో ప్రయాణించిన  ప్రయాణీకులు  ఆశ్చర్యం వ్యక్తం  చేశారు.  ప్రధాని మోడీతో పలువురు ప్రయాణీకులు  మాట్లాడారు. ప్రధాని మోడీ కూడ  ప్రయాణీకులతో నవ్వుతూ  మాట్లాడారు.

ఢిల్లీ యూనివర్శిటీ  శతాబ్ది ఉత్సవాల ముగింపు కార్యక్రమం ఇవాళ నిర్వహించనున్నారు.   ఈ ఉత్సవాల ముగింపు కార్యక్రమంలో  ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ పాల్గొంటారు.   ఢిల్లీ యూనివర్శిటీ కంప్యూటర్ సెంటర్, ఫ్యాకల్టీ ఆఫ్ టెక్నాలజీ భవనం , యూనివర్శిటీ  నార్త్ క్యాంపస్ లో  అకడమిక్  భవనాలకు  ప్రధాని శంకుస్థాపన  చేయనున్నారు. 

 

ఢిల్లీ యూనివర్శిటీ  శతాబ్ది ఉత్సవాలను  పురస్కరించుకొని  యూనివర్శిటీ  మార్గదర్శకాలను  నిర్ధేశించింది.  నల్లటి దుస్తులు ధరించవద్దని  యూనివర్శిటీ ఆదేశించింది.  అంతేకాదు  ఇవాళ కచ్చితంగా యూనివర్శిటీకి హాజరుకావాలని కోరింది.  మరోవైపు  ఇవాళ ఉదయం  10 నుండి  12 గంటల వరకు  యూనివర్శిటీలో తరగతులు  నిర్వహించవద్దని   ఆదేశించింది.1922 మే 1వ తేదీన  ఢిల్లీ యూనివర్శిటీని స్థాపించారు.  గత శతాబ్దంలో  ఆరు లక్షల మంది విద్యార్ధులు ఈ యూనివర్శిటీలో విద్యనభ్యసించారు.
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Viral News: ఈ గ్రామంలో మ‌హిళ‌లు 5 రోజులు న‌గ్నంగా ఉంటారు.. వింత ఆచారం ఎక్క‌డంటే
Census 2027: 30 లక్షల మంది సిబ్బంది, రూ. 11,718 కోట్లు.. ప్రపంచంలోనే అతిపెద్ద ఫీల్డ్ ఆపరేషన్‌గా జ‌న‌గ‌ణ‌న‌