PM Modi: ప్రధాని మోడీ రోజూ ఎంత సేపు నిద్రపోతారో తెలుసా..

Published : Mar 22, 2022, 04:10 AM IST
PM Modi: ప్రధాని మోడీ రోజూ ఎంత సేపు నిద్రపోతారో తెలుసా..

సారాంశం

PM Modi: ప్ర‌తి స‌గ‌టు భారతీయుడిని ప్రధాని గురించి తెలుసుకోవాల‌ని ఉంటుంది. ఆయ‌న ఎన్ని గంటలు శ్రమిస్తారు.  రోజులో ఎంత సేపు నిద్ర‌పోతారనేది తెలుసుకోవాల‌ని ఉంటుంది. ఇదే అంశానికి సంబంధించి మహారాష్ట్ర బీజేపీ చీఫ్.. ఆసక్తికర అంశాలను వెల్లడించారు.  

PM Modi:  ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ వ్య‌క్తిగ‌త విష‌యాలు తెలుసుకోవడాని ప్ర‌తి ఒక్క‌రూ ఇష్ట‌డుతుంటారు. సాధార‌ణంగా ఆయ‌న ఎన్ని గంటలు ప‌ని చేస్తారు. ఎన్ని గంట‌లు విశ్రాంతి తీసుకుంటారని, ఆయ‌న రోజువారీ దిన చ‌ర్య ఏలా ఉంటుంది స‌రిగా అలాంటి  అంశానికి సంబంధించి మహారాష్ట్ర బీజేపీ చీఫ్.. ప్ర‌ధాని మోడీ గురించి  ఆసక్తికర అంశాలను వెల్లడించారు. 

ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిరోజూ రెండు గంటలు మాత్రమే నిద్రపోతారని, ఆయ‌న నిద్రపోకుండా, దేశం కోసం 24 గంటల పాటు పని చేస్తున్నార‌ని అన్నారు. ఈ మ‌ధ్య ఆయ‌న నిద్ర‌పోకుండా ఓ ప్ర‌యోగం చేస్తున్నారని మహారాష్ట్ర బీజేపీ చీఫ్ చంద్రకాంత్ పాటిల్ పేర్కొన్నారు. ఇటీవల కొల్హాపూర్ నార్త్ అసెంబ్లీ ఉప ఎన్నికలకు ముందు కొల్హాపూర్‌లో బీజేపీ కార్యకర్తలను ఉద్దేశించి పాటిల్ ఈ వ్యాఖ్య చేశారు.

ప్రధాని ఇప్పుడు నిద్రపోనవసరం లేకుండా ప్రయోగాలు చేస్తున్నాడు, ప్రధాని దేశం కోసం ప్రతి నిమిషం పని చేస్తారు. మోడీ 24 గంటలు మేల్కొని ఉండటానికి నిద్రను నిరోధించడానికి ప్రయత్నిస్తున్నారని పాటిల్ అన్నారు. దేశం కోసం పని చేయండి అతను ఒక్క నిమిషం కూడా వృధా చేయడు" అన్నారాయన. ప్రధాని మోడీ చాలా సమర్ధవంతంగా పని చేస్తారని, దేశంలో అన్ని పార్టీలో జరుగుతున్న పరిణామాలు ఆయనకు తెలుసునని బీజేపీ నేత అన్నారు.

ఇదిలావుంటే, 2019లో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ ప్రధాని మోడీని ప్ర‌త్యేక ఇంటర్వ్యూ చేసిన విష‌యం తెలిసిందే.. ఈ ఇంటర్వ్యూలో అక్షయ్.. ప్ర‌ధాని వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక ప్రశ్నలు ప్రధాని  అడిగారు. అప్ప‌డు ప్ర‌ధాని నిద్ర గురించి.. ఒక ప్రశ్న వచ్చింది. దానికి ప్రధాని స్పందిస్తూ నేను కేవలం మూడున్నర నుంచి నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతున్నాను అని చెప్పారు.

PREV
click me!

Recommended Stories

MICE పథకం.. ఈ రంగంలో గేమ్‌ చేంజర్
రైళ్లలో ఇకపై లగేజీకి ఛార్జీలు:Ashwini Vaishnaw on Indian Railway Luggage Rules | Asianet News Telugu