
Congress: 'ది కాశ్మీర్ ఫైల్స్' అనే చిత్రం దేశవ్యాప్తంగా సంచలన రేపుతోంది. ఈ చిత్రం విడుదలైన తర్వాత ఎక్కడ చూసినా.. కాశ్మీరీ పండిట్ల వలస గురించి చర్చ సాగుతోంది. తాజాగా పార్లమెంట్ లో కాశ్మీరీ పండిట్లపై జరిగిన దారుణాలు చర్చనీయంగా మారాయి. జీరో అవర్ సమయంలో కాశ్మీర్ పండిట్ల అంశాన్నిబిజెపి ఎంపీ సునీల్ కుమార్ సింగ్ లేవనెత్తారు.1980 నుండి 1990 వరకు కాశ్మీర్‌లో హిందువులు, సిక్కులపై జరిగిన దురాగతాలపై ప్రభుత్వం విచారణ ప్రారంభించాలని డిమాండ్ చేశారు.
ముఖ్యంగా రాజీవ్ గాంధీ హయంలో1984 నుండి 1989 మధ్య కాలంలో కాశ్మీర్‌లో హిందువులు, సిక్కులపై పెద్ద ఎత్తున అఘాయిత్యాలు జరిగాయనీ, వాటిపై ప్రభుత్వం విచారణ ప్రారంభించాలని బిజెపి ఎంపీ సునీల్ కుమార్ సింగ్ డిమాండ్ చేశారు. 1989లో జమ్మూ కాశ్మీర్‌లో మొత్తం 70 మంది ఉగ్రవాదులను ఎవరి ఆదేశాల మేరకు విడుదల చేశారనే దానిపై విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. ఆ ఉగ్రవాదులు మారణహోమంలో పాత్ర పోషించారనీ, ఈ విషయాన్ని దేశం తెలుసుకోవాలనుకుంటున్నదని ఆయన అన్నారు.
ఈ ప్రశ్నపై కాంగ్రెస్ నాయకుడు అధీర్ రంజన్ చౌదరి స్పందించారు. అధికార బిజెపిని ఇరుకున పెట్టాలని ప్రయత్నించారు, ఈ విషయంలో అప్పటి ప్రతిపక్ష నాయకుడు రాజీవ్ గాంధీ జోక్యం చేసుకున్నారనీ, ఆ హింసాకండను ఆపాలని, కాశ్మీర్ నుండి హిందువుల వలసలను ఆపాలని, కాశ్మీరీ పండిట్లపై, సిక్కులపై దౌర్జన్యాలు జరుగుతున్నాయని VP సింగ్ ప్రభుత్వాన్ని సూచించారని చెప్పుకోచ్చారు. కాశ్మీర్ లోయ నుండి వలసలు ప్రారంభమైన తర్వాత.. అప్పటి జమ్మూ కాశ్మీర్ గవర్నర్ జగ్‌మోహన్ కాశ్మీరీ పండిట్‌లు, సిక్కులను విడిచిపెట్టమని కోరారని, వారిని తాను రక్షించలేనని చెప్పారని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఉగ్రవాదులు, జిహాదీలు అన్ని పండిట్లపై, సిక్కులపై దౌర్జన్యాలకు పాల్పడ్డాయని, అప్పటి వీపీ సింగ్ ప్రభుత్వానికి బిజెపి మద్దతు ఇచ్చిందని కూడా తెలిపారు. రాజీవ్ గాంధీ కాశ్మీర్ వలసలకు వ్యతిరేకంగా తన స్వరాన్ని లేవనెత్తారని, దానిని ఎలాగైనా ఆపాలని అప్పటి ప్రభుత్వాన్ని కోరారని, దేశ ప్రజలు అలా చేయరని హెచ్చరించారు. ఆ సమయంలో, లాల్ కృష్ణ అద్వానీ జీ రథయాత్ర ప్రారంభమైందనీ, (ప్రస్తుత) మన ప్రధానమంత్రి (నరేంద్ర) మోడీ జీ ఈ యాత్రకు ఈవెంట్ మేనేజర్‌గా ఉన్నారని విమర్శించారు.