2016లో బంగాళాఖాతంలో కూలిపోయిన భారత వైమానిక దళానికి చెందిన విమాన ప్రమాద మిస్టరీ వీడింది. చెన్నై తీరానికి 310 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో ఈ విమాన శకలాలు కనిపించాయి.
విమాన ప్రమాదాలు చాలా వరకు మిస్టరీతో కూడుకుని ఉంటాయి. అందరికీ దూరంగా ఆకాశంలో ప్రయాణిస్తుండగా అకాస్మాత్తుగా నేలపై పడిపోతాయి. ముందు ఆ ప్రమాద స్థలిని గుర్తించాల్సి ఉంటుంది. ఆ తర్వాత ప్రమాదానికి గల కారణాలనూ కనుగొనాల్సి ఉంటుంది. అయితే, ఎనిమిదేళ్ల క్రితం చెన్నై తీరానికి 310 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో కూలిపోయిన భారత వైమానిక దళానికి చెందిన విమాన ప్రమాద ఘటన ఇప్పటికీ మిస్టరీగానే ఉండింది. తాజాగా, ఈ విమాన శకలాలు దొరికాయి.
2016 జులైో 22వ తేదీ ఉదయం 8 గంటలకు ఏఎన్-32 ట్రాన్స్‌పోర్ట్ ఫ్లైట్ కే-2743 విమానం చెన్నైలోని తాంబరం ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి బయల్దేరింది. అది అండమాన్ నికోబార్ దీవుల్లోని పోర్ట్ బ్లెయిర్‌కు చేరాల్సి ఉన్నది. టేకాఫ్ అయిన 16 నిమిషాలకు అంతా నార్మల్‌గానే ఉన్నదని పైలట్ చెప్పాడు. ఆ తర్వాత నిమిషాల వ్యవధిలోనే రాడార్ నుంచి అది కనిపించకుండా పోయింది. అత్యంత వేగంతో అది వేగంగా కిందపడిపోయింది. ఆ విమానంలో ఎనిమిది మంది సాధారణ పౌరులు సహా మొత్తం 29 మంది ఉన్నారు.
దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు ఆ విమానాన్ని గుర్తించేందుకు అనేక ప్రయత్నాలు చేశారు. 3,400 మీటర్ల లోతు వరకు మల్టీ బీమ్ సోనార్, సింథటిక్ అపార్చర్ సోనార్, హై రిజల్యూషన్ ఫొటోగ్రఫీల ద్వారా అన్వేషణ ప్రారంభించారు. వీటి ద్వారా చెన్నై తీరం నుంచి 310 కిలోమీటర్ల దూరంలోని సముద్రం అడుగున ధ్వంసమైన విమాన శకలాలను గుర్తించారు.
Also Read: TS News: పార్టీ ఓటమికి నేనే బాధ్యుడ్ని: కేటీఆర్.. లోక్ సభ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపై క్లారిటీ
సముద్రపు లోతైన ప్రాంతంలో ఆ విమాన శకలాల ఫొటోగ్రాఫ్‌లను తీయగలిగారు. ఆ శకలాలు ఐఏఎఫ్‌కు చెందిన విమానానివేనని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఒషియన్ టెక్నాలజీ పేర్కొంది. ఆ తర్వాత ఆ విమానంలో మరణించిన కుటుంబ సభ్యులకు లేఖలు రాసి విషయం చెప్పేసింది. ఇప్పుడు దాదాపు ఎనిమిదేళ్ల తర్వాత అదే ప్రాంతంలో చెన్నై తీరానికి 310 కిలోమీటర్ల దూరంలో ఆ విమాన శకలాలు కనిపించాయి.