డబుల్ ఇంజిన్ ప్రభుత్వం పేదలకు సౌకర్యాలు కల్పించడానికి కట్టుబడి ఉంది: ప్రధాని మోదీ

By Rajesh KarampooriFirst Published Jan 20, 2023, 3:25 AM IST
Highlights

పేదలకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు 'డబుల్ ఇంజన్ ప్రభుత్వం' కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.

పేదలకు సౌకర్యాలు కల్పించడానికి కేంద్రం, మహారాష్ట్రలోని డబుల్ ఇంజిన్ ప్రభుత్వం కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ముంబయిలోని MMRDA గ్రౌండ్స్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని మోడీ ప్రసంగిస్తూ.."డబుల్ ఇంజన్ ప్రభుత్వం పేద ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి కట్టుబడి ఉందనీ,  
అందువల్ల.. విమానాశ్రయం తరహాలో రైల్వే స్టేషన్‌లను కూడా అభివృద్ధి చేస్తున్నారని అన్నారు.CSMT ఇది పురాతనమైనది. రైల్వే స్టేషన్లు పునరాభివృద్ధి చేయబడుతున్నాయి. తాము బహుళ-మోడల్ కనెక్టివిటీ కోసం ముందుకు వస్తున్నామని తెలిపారు. 

మెట్రో రైలు మార్గాలను ప్రారంభించేందుకు, బహుళ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ప్రధాని ముంబైకి వచ్చారు. బీజేపీ, దాని మిత్రపక్షాలు అభివృద్ధికి రాజకీయాలకు ప్రాధాన్యత ఇవ్వవని ప్రధాని మోదీ అన్నారు. గత కొన్నేళ్లుగా ముంబై అభివృద్ధి నెమ్మదిగా ఉందని, గత కొన్నేళ్లుగా అది వేగాన్ని పుంజుకుందని ఆయన తెలిపారు. అంధేరి నుండి దహిసర్ వరకు విస్తరించి ఉన్న 35 కిలోమీటర్ల పొడవైన ఎలివేటెడ్ కారిడార్‌తో కూడిన ముంబై మెట్రో లైన్లను గురువారం ప్రధాని మోదీ ప్రారంభించారు. అలాగే.. శివసేన వ్యవస్థాపకుడు బాల్ థాకరే పేరుతో 20 ఆప్లా దవాఖానా హెల్త్ క్లినిక్‌లను కూడా ఆయన ప్రారంభించారు. బిజెపిని 'ముంబయి వ్యతిరేక'గా చిత్రీకరించే మహా వికాస్ అఘాడి (MVA) ప్రయత్నాలను ఎదుర్కోవడానికి బిజెపి వ్యూహంలో భాగంగా ప్రధానమంత్రి పర్యటన జరిగింది.  

ఇదిలా ఉంటే.. కర్ణాటకలోని కలబురగి జిల్లాలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించారు. అంతకుముందు ఆయన మాట్లాడుతూ శతాబ్దాల క్రితం బసవేశ్వరుడు దేశానికి, ప్రపంచానికి అందించిన సుపరిపాలన, సామరస్య మార్గాన్ని కర్ణాటక ప్రభుత్వం ఎంచుకుందన్నారు. బసవేశ్వర భగవానుడు అనుభవ మండపం వంటి వేదికపై నుండి ప్రపంచానికి సామాజిక న్యాయం,  ప్రజాస్వామ్య నమూనాను అందించాడు. సమాజంలోని ప్రతి వివక్షను అధిగమించి అందరి సాధికారత మార్గాన్ని ఆయన మనకు చూపించారని అన్నారు.

దళితులు, వెనుకబడిన, గిరిజనులు అతిపెద్ద వర్గమని, వారు బ్యాంకుల తలుపులు కూడా చూడలేదని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. జన్ ధన్ బ్యాంకు ఖాతాలు కోట్లాది మంది నిరుపేదలను బ్యాంకులతో అనుసంధానం చేయబడ్డాయని తెలిపారు. మునుపటి ప్రభుత్వం కొన్ని అటవీ ఉత్పత్తులకు మాత్రమే MSP ఇస్తుండగా.. తమ ప్రభుత్వం 90 కంటే ఎక్కువ అటవీ ఉత్పత్తులపై MSP ఇస్తోందని తెలిపారు. కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తర్వాత.. ఇప్పుడు దాని ప్రయోజనాలు తండాలో నివసిస్తున్న అన్ని కుటుంబాలకు కూడా అందుబాటులో ఉంటాయని తెలిపారు. 

మహిళల సంక్షేమానికి పెద్దపీట వేస్తున్న తమ ప్రభుత్వం నేడు కొత్త రంగాల్లో వారికి అవకాశాలను కల్పిస్తోందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. గిరిజన సంక్షేమం పట్ల సున్నితత్వం ఉన్న తమ ప్రభుత్వం గిరిజనుల సహకారం, వారి గర్వానికి జాతీయ గుర్తింపు కల్పించడానికి కృషి చేస్తోందని తెలిపారు. వికలాంగుల హక్కులు, వారి సౌకర్యాలకు సంబంధించిన అనేక నిబంధనలు కూడా గత 8 సంవత్సరాలలో చేయబడ్డాయని తెలిపారు. 

ఉత్తర కర్ణాటకలోని ఐదు జిల్లాల్లో సంచార జాతులైన లంబానీ (బంజారా) తెగకు చెందిన 52,000 మంది సభ్యులకు భూమి హక్కు పత్రాలను అందించే 'హక్కు పత్ర' పంపిణీ కార్యక్రమాన్ని ప్రధాని మోదీ ప్రారంభించారు. జిల్లాలోని మల్‌ఖేడ్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రధాని ప్రసంగిస్తూ, బంజారా (లంబానీ సంచార) సామాజిక వర్గానికి చెందిన 50,000 మందికి పైగా ప్రజలు 'హక్కు పత్ర' ద్వారా తమ ఇళ్లపై హక్కును పొందారని, ఇది గొప్ప రోజు అని అన్నారు.
 
ఈ సందర్భంగా ఐదు సంచార జంటలకు ప్రధాని మోదీ ఐదు 'హక్కు పత్రాలు' పంపిణీ చేశారు. కలబురగి, బీదర్‌, యాద్గిర్‌, రాయచూర్‌, విజయపుర జిల్లాల్లోని తండాల్లో (లంబానీ వర్గాల ఆవాసాలు) నివసిస్తున్న వేలాది మంది ప్రజల భవిష్యత్తుకు ఈ 'హక్కు పత్ర' భద్రత కల్పిస్తుందని ఆయన అన్నారు. కలబురగి, యాద్గిర్, రాయచూర్, బీదర్, విజయపుర జిల్లాల్లో దాదాపు 1,475 నమోదుకాని ఆవాసాలను కొత్త రెవెన్యూ గ్రామాలుగా ప్రకటించారు.

click me!