ఓఎల్ఎక్స్ లో ప్రధాని ఆఫీస్ అమ్మకానికి.. !

Bukka Sumabala   | Asianet News
Published : Dec 19, 2020, 09:29 AM IST
ఓఎల్ఎక్స్ లో ప్రధాని ఆఫీస్ అమ్మకానికి.. !

సారాంశం

ఆన్ లైన్ మోసగాళ్లు బరితెగించారు. ఏకంగా దేశ ప్రధాని ఆఫీసునే అమ్మకానికి పెట్టారు. చివరికి పట్టుబడ్డారు. ప్రధాని నరేంద్ర మోదీ ప్రజావ్యవహారాల కార్యాలయాన్ని కొందరు ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టారు. ప్రధాని మోదీ ప్రాతినిధ్యం వహిస్తున్న వారణాసిలోని గురుధామ్ కాలనీలో ఉన్న ప్రధానమంత్రి కార్యాలయాన్ని రూ.7.5 కోట్లకు కొందరు ఆకతాయిలు ఓఎల్ఎక్స్‌లో అమ్మకానికి పెట్టారు. 

లక్ష్మీకాంత్ ఓజా అనే వ్యక్తి ప్రధాని కార్యాలయాన్ని అమ్మకానికి పెట్టినట్టు యాడ్ ద్వారా తెలుస్తోంది. ఇందులో నాలుగు బెడ్ రూమ్‌లు, నాలుగు బాత్‌రూమ్‌లు ఉన్నాయని, ఆఫీసు మొత్తం వైశాల్యం6,500 చదరపు అడుగులు ఉన్నట్టు పేర్కొన్నారు. రెండు అంతస్థులు, రెండు కార్ల పార్కింగ్‌కు సంబంధించిన స్పేస్ ఉండే ఈ భవనాన్ని మినీ పీఎంవోగా తెలిపారు.

మొత్తానికి ఈ విషయం పోలీసుల దృష్టికి రావడంతో ముందుగా అవాక్కయ్యారు వెంటనే ఆ యాడ్‌‌ను తొలగించారు. బెలుపూర పోలీస్ స్టేషన్ పరిధిలో ఇందుకు సంబంధించిన కేసు నమోదు చేశారు. కొన్ని అసాంఘిక శక్తులు ఈ రకమైన చర్యలు పాల్పడ్డాయని వారణాసి సీనియర్ సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ అమిత్ పాఠక్ తెలిపారు. లక్ష్మీకాంత్ ఓజా సహా నలుగురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు.

PREV
click me!

Recommended Stories

యువతకు బంపరాఫర్ ... 2026లో లక్షన్నర ప్రభుత్వ కొలువులు
భారత్–ఒమన్ వ్యాపార వేదికలో మోదీ కీలక వ్యాఖ్యలు | India–Oman Business Forum | Asianet News Telugu