శ్రీనగర్ టు ఢిల్లీ.. మోడీని కలవడానికి వీరాభిమాని సాహస పాదయాత్ర...

By AN TeluguFirst Published Aug 23, 2021, 10:57 AM IST
Highlights

ఫాహిమ్ నజీర్ షా (28 ) జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో పార్ట్‌టైమ్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. తన ఈ ప్రయాణంలో భాగంగా  200 కిలోమీటర్లు నడిచి ఆదివారం ఉదంపూర్ చేరుకున్నాడు. ఈ సందర్బంగా అతను మాట్లాడుతే "నేను ప్రధాని మోడీకి చాలా పెద్ద అభిమానిని" అని చెప్పుకొచ్చాడు.

ఉధంపూర్ : ప్రధాని మోడీ వీరాభిమాని ఒకరు శ్రీనగర్ నుంచి ఢిల్లీకి పాదయాత్ర చేస్తున్నాడు. మోడీని కలిసేందుకు ఏకంగా 815 కిలోమీటర్లు నడిచి వస్తున్నాడు. ఈసారైనా ప్రధానిని కలిసే అవకాశం వస్తుందని ఫాహిమ్ నజీర్ షా అనే వీరాభిమాని ఆశాభావం వ్యక్తం చేశారు. 

ఫాహిమ్ నజీర్ షా (28 ) జమ్మూ కాశ్మీర్‌లోని శ్రీనగర్‌లో పార్ట్‌టైమ్ ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. తన ఈ ప్రయాణంలో భాగంగా  200 కిలోమీటర్లు నడిచి ఆదివారం ఉదంపూర్ చేరుకున్నాడు. ఈ సందర్బంగా అతను మాట్లాడుతే "నేను ప్రధాని మోడీకి చాలా పెద్ద అభిమానిని" అని చెప్పుకొచ్చాడు.

శ్రీనగర్‌లోని షాలిమార్ ప్రాంతానికి చెందిన షా మాట్లాడుతూ.. రెండు రోజుల క్రితం తన ప్రయాణం ప్రారంభమైందని.. ఈ ప్రయాణంలో చిన్న విరామాలు తీసుకుంటూ ముందుకు సాగుతున్నానని తెలిపారు. ఈ కష్టతరమైన ప్రయాణంలో ప్రధానమంత్రిని కలవాలనే తన కల నెరవేరుతుందని నమ్ముతున్నానన్నారు.

"నేన నరేంద్ర మోడీని కలవడానికి కాలినడకన ఢిల్లీ బయల్దేరాను. ప్రధాని దృష్టిలో పడతానని ఆశిస్తున్నాను. ప్రధానమంత్రిని కలవడం నా చిరకాల కోరిక" అని ఆయన అన్నారు. అంతకు ముందు ప్రధానిని కలవాలని ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించలేదు.

నరేంద్రమోడీని గత నాలుగేళ్లుగా సోషల్ మీడియాలో ఫాలో అవుతున్నాను. ఆయన ప్రసంగాలు, దేశ ప్రజల కోసం ఆయన తీసుకునే చర్యలు నన్ను బాగా కదిలించాయి అని షా అన్నారు.

మత్తు ఇంజక్షన్ తో తల్లి, చెల్లిని హతమార్చి.. నిద్రమాత్రలు మింగిన హోమియో డాక్టర్.. !

మోడీ ఒక ర్యాలీలో ప్రసంగం చేస్తున్నప్పుడు, '' ఆజా '' (ముస్లింలు ప్రార్థన కోసం ఇచ్చే  పిలుపు) వినిపించింది. మోడీ వెంటనే తన ప్రసంగాన్ని ఆపేశారు. ఆజాకు తనిచ్చే గౌరవంతో ప్రజలను ఆశ్చర్యపరిచాడు. ప్రధాని ఆ చర్య సూటిగా నా హృదయాన్ని తాకింది. ఈ ఒక్క సంఘటనతో  నేను అయనకు వీరాభిమానినిని అయిపోయాను’ అని షా చెప్పాడు.

ఈ క్రమంలో గత రెండేళ్లుగా, ఢిల్లీలో ప్రధానిని కలవాలని అనేక ప్రయత్నాలు చేశానని మిస్టర్ షా చెప్పారు. "కాశ్మీర్‌లో ప్రధాని పర్యటన ముగింపు సందర్భంగా కలవాలని ప్రయత్నిస్తే, భద్రతా సిబ్బంది నన్ను కలిసేందుకు అనుమతించలేదు" అని ఆయన అన్నారు. "ఈసారైనా నాకు ప్రధానిని కలిసే అవకాశం వస్తుందని నేను ఖచ్చితంగా భావిస్తున్నాను’’ అంటూ షా ఆశాభావం వ్యక్తం చేశారు. 

2019 లో జమ్మూ కాశ్మీర్ ప్రత్యేక హోదా రద్దు చేయబడింది. దీంతో ఇది రాష్ట్రం నుండి కేంద్రపాలిత ప్రాంతంగా మార్చబడింది. ఆ తరువాత జమ్మూ కాశ్మీర్‌పై ప్రధాని మోడీ ప్రత్యేక దృష్టి పెట్టినందున మార్పు కనిపిస్తోందా? అని ఆయనను అడిగినప్పుడు... అతను సమాధానం ఇస్తూ.. 

"పరిస్థితిలో చాలా మార్పు ఉంది, అభివృద్ధి కార్యకలాపాలు మంచి వేగంతో జరుగుతున్నాయి. కేంద్రపాలిత ప్రాంతం అభివృద్ధి చెందుతోంది" అని ఆయన అన్నారు. మోడీని కలిస్తే జమ్మూ కశ్మీర్ లోని విద్యావంతులు, నిరుద్యోగ యువత సమస్యలపై, కేంద్రపాలిత ప్రాంతంలో పారిశ్రామిక రంగాన్ని అభివృద్ధి చేయడం గురించి ప్రధాన మంత్రితో చర్చించాలనుకుంటున్నట్లు షా చెప్పారు.
 

click me!