మత్తు ఇంజక్షన్ తో తల్లి, చెల్లిని హతమార్చి.. నిద్రమాత్రలు మింగిన హోమియో డాక్టర్.. !

Published : Aug 23, 2021, 09:30 AM IST
మత్తు ఇంజక్షన్ తో తల్లి, చెల్లిని హతమార్చి.. నిద్రమాత్రలు మింగిన హోమియో డాక్టర్.. !

సారాంశం

దర్శనప్రజాపతి అనే 31యేళ్ల హోమియో డాక్టర్.. తన తల్లి మంజుల (59)కి, చెల్లె ఫాల్గుణి (29)లకు ఎక్కువ మోతాదు ఉన్న అనస్థిటిక్ డ్రగ్ ఇంజక్షన్ ఇచ్చింది. ఫాల్గుణి ఓ స్కూల్లో టీచర్ గా పనిచేస్తుంది. వీరిద్దరికీ ఇంజక్షన్లు ఇచ్చిన తరువాత ప్రజాపతి కూడా 26 నిద్రమాత్రలు మింగింది. 

గుజరాత్ : సూరత్ లో దారుణం జరిగింది. ఓ డాక్టర్ తల్లిని, చెల్లిని దారుణంగా హతమార్చింది. ఆ తరువాత ఆమె ఆత్మహత్యకు పాల్పడింది. శనివారం రాత్రి జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. సూరత్ లోని కటరగమ్ ప్రాంతంలో ఉన్న డాక్టర్ ఇంట్లో ఈ దారుణం జరిగింది. 

వివరాల్లోకి వెడితే.. దర్శనప్రజాపతి అనే 31యేళ్ల హోమియో డాక్టర్.. తన తల్లి మంజుల (59)కి, చెల్లె ఫాల్గుణి (29)లకు ఎక్కువ మోతాదు ఉన్న అనస్థిటిక్ డ్రగ్ ఇంజక్షన్ ఇచ్చింది. ఫాల్గుణి ఓ స్కూల్లో టీచర్ గా పనిచేస్తుంది. వీరిద్దరికీ ఇంజక్షన్లు ఇచ్చిన తరువాత ప్రజాపతి కూడా 26 నిద్రమాత్రలు మింగింది. 

అయితే ఈ ఘటనలో ప్రజాపతి అన్న గౌరవ్ బయటపడ్డాడు. అతను ఏదో పనిమీద ముంబై వెళ్లి ఆదివారం ఉదయం తిరిగి రావడంతో చావు నుంచి తృటిలో తప్పించుకున్నాడు. అతను ఇంటికి వచ్చాకే వీరి హత్యలు, ఆత్మహత్యల విషయం వెలుగులోకి వచ్చింది. కొనప్రాణంతో ఉన్న ప్రజాపతిని గౌరవ్ రక్షించాడు. ఆమెను ఆస్పత్రిలో చేర్పించాడు. రక్షాబంధన్ నాడు జరిగిన ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని మిగిల్చింది.

గౌరవ్ ఫిర్యాదు మేరకు పోలీసులు ప్రజాపతి మీద తల్లిని, చెల్లిని చంపిన కేసు నమోదు చేశారు. చౌక్ బజార్ పోలీస్ స్టేషన్లో దర్యాప్తు సాగుతుంది. సమయానికి కాపాడడంతో ప్రజాపతి మృత్యముఖంనుంచి బయటపడి కోలుకుంటోంది. 

ఐటీ పోర్టల్‌లో అవాంతరాలపై ఇన్ఫోసిస్‌ను వివరణ కోరిన ఆర్ధికశాఖ.. కేంద్రమంత్రి రాజీవ్ చంద్రశేఖర్ స్పందన

సంఘటన స్థలంలో ఓ సూసైడ్ లేఖ కూడా పోలీసులకు దొరికింది. దాంట్లో ‘జీవితం మీద విరక్తి చెంది. తాను ఆత్మహత్య చేసుకుంటున్న’ట్లు ప్రజాపతి రాసుకొచ్చింది. పోలీసుల విచారణలో.. తల్లీ, చెల్లి తనమీద చాలా ఆధారపడతారని.. తను లేకపోతే వారు ఏమై పోతారో, వారి జీవితాలు ఎలా మారిపోతాయో అని భయపడి.. ముందుగా వారిని చంపి తాను ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రజాపతి తెలిపిందని ఓ పోలీస్ అధికారి అన్నారు. 

‘వారికి ఇచ్చిన ఇంజెక్షన్ 10ఎంఎల్ అనస్థిటిక్ డ్రగ్. మామూలుగా 2ఎంఎల్ ఇస్తారు’ అని పోలీసులు తెలిపారు. ఇక వారిద్దరికీ ఇచ్చాక.. ఇంట్లో  అనస్థిటిక్ డ్రగ్ సరిపోయేంత లేకపోవడంతో ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు పాల్పడిందని ఆమె తన స్టేట్మెంట్లో తెలిపిందని అధికారులు తెలిపారు. 

మరి ఇంజక్షన్ ఇస్తుంటే తల్లి, చెల్లి ఎలా ఒప్పుకున్నారు.. అంటే వారిద్దరూ కీళ్ల నొప్పులతో బాధ పడుతున్నారట.. ఈ ఇంజక్షన్ వల్ల నొప్పులు తగ్గుతాయని, పెయిన్ కిల్లర్ ఇంజక్షన్ అని చెప్పి ఇచ్చిందని పోలీసుల దర్యాప్తులో తేలింది. 

PREV
click me!

Recommended Stories

TTV Dhinakaran Meets Governor: మా MLA లను విజయ్ కొంటున్నాడుగవర్నర్ కు AMMK ఫిర్యాదు | Asianet Telugu
Vijay Meets Governor Arlekar: ప్రభుత్వ ఏర్పాటుకు మూడోసారి గవర్నర్ ను కలిసిన విజయ్| Asianet Telugu