కోవిడ్‌‌పై కేంద్రం అలర్ట్.. ప్రధాని మోదీ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమావేశం..

Published : Dec 22, 2022, 05:53 PM IST
కోవిడ్‌‌పై కేంద్రం అలర్ట్.. ప్రధాని మోదీ నేతృత్వంలో ఉన్నతస్థాయి సమావేశం..

సారాంశం

దేశంలో కోవిడ్-19కి సంబంధించిన పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. 

దేశంలో కోవిడ్-19కి సంబంధించిన పరిస్థితిని సమీక్షించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ గురువారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. కేంద్ర ఆరోగ్య‌శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయా, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా, పలు శాఖలకు చెందిన ఉన్నతాధికారులు వర్చువల్‌గా ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశం అనంతరం ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం పలు సూచనలు జారీచేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. 

ఇక, ఈ సమావేశానికి ముందు లోక్‌సభలో మంత్రి మన్సుఖ్ మాండవీయా మాట్లాడుతూ.. కరోనా‌కు సంబంధించి రాష్ట్రాలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఫేస్ మాస్క్‌లు ధరించడం, హ్యాండ్ శానిటైజర్‌లను ఉపయోగించడం గురించి ప్రజల్లో అవగాహన కల్పించాలని కోరారు. ముఖ్యంగా రాబోయే పండుగలు, కొత్త సంవత్సర వేడుకల దృష్ట్యా ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పారు. 

Also Read: కరోనాపై లోక్ సభలో ప్రకటన చేసిన కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవీయ.. ఏమన్నారంటే ?

చైనా‌తో పాటు మరికొన్ని దేశాల్లో కోవిడ్ కేసులు పెరగడంతో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. ఈ క్రమంలోనే రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను సూచనలు జారీచేయడంతో పాటు పరిస్థితులపై సమీక్షలు నిర్వహిస్తుంది. ఇక, విదేశాల నుంచి వచ్చేవారిలో కొందరిని విమానాశ్రయాలలో యాదృచ్ఛికంగా ఎంపిక చేసి నమూనాలను పరీక్షలు పరీక్షించనున్నట్టుగా అధికారిక వర్గాలు తెలిపాయి.

PREV
click me!

Recommended Stories

గంటకు 9 కి.మీ స్పీడ్, 46 కి.మీ ప్రయాణానికి 5 గంటలా..! దేశంలోనే స్లోయెస్ట్ ట్రైన్ ఏదో తెలుసా?
Weather Update : మళ్లీ భారీ వర్షాలు.. ఈ ప్రాంతాలకు ఐఎండీ అలర్ట్ !