రైతాంగానికి నవరాత్రి కానుక : ఒక్క యూపీకే పీఎం కిసాన్ నిధులెన్ని వెళ్లాయో తెలుసా?

By Arun Kumar PFirst Published Oct 5, 2024, 10:46 PM IST
Highlights

శరన్నవరాత్రి పర్వదినం సందర్భంగా ప్రధాని మోడీ పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 18వ విడత నిధులను విడుదల చేశారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా 9.4 కోట్ల మంది రైతులతో పాటు యూపీలోని 2.25 కోట్ల మంది రైతులు లబ్ధి పొందారు.

లక్నో : దేవీ శరన్నవరాత్రుల వేళ  దేశ రైతాంగానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శుభవార్త చెప్పారు. మహారాష్ట్రలోని వాషిమ్ నుండి పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 18వ విడత నిధులను ఆయన విడుదల చేశారు. దీంతో దేశవ్యాప్తంగా 9.4 కోట్ల మంది రైతులతో పాటు ఉత్తరప్రదేశ్‌లోని 2.25 కోట్ల మంది రైతులు లబ్ధి పొందనున్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు.

ఒక్క క్లిక్ తో యూపీ రైతుల ఖాతాల్లోకి 4985.49 కోట్లు

Latest Videos

ప్రధాని మోడీ ఒక్క క్లిక్ తో యూపీ రైతుల ఖాతాల్లోకి 4985.49 కోట్ల రూపాయలను జమ చేశారు. దేశవ్యాప్తంగా 9.4 కోట్ల మంది రైతుల ఖాతాల్లోకి 20,000 కోట్ల రూపాయలకు పైగా జమ అయ్యాయి. గతంలో లోక్‌సభ ఎన్నికల తర్వాత జూన్ 18న తన నియోజకవర్గం వారణాసి నుండి 17వ విడత నిధులను ప్రధాని మోడీ విడుదల చేసిన విషయం తెలిసిందే.

 రైతుల ఖాతాల్లోకి పీఎం సమ్మాన్ నిధి జమ అయిన సందర్భంగా ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ప్రధాని మోడీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా ఖాతా 'ఎక్స్' లో పోస్ట్ చేశారు.

రైతుల జీవితాలను సుఖమయం చేయడానికి, స్వావలంబన సాధించడానికి, వారిని సుసంపన్నులను చేయడానికి నిరంతరం కృషి చేస్తున్న ప్రధాని మోడీ మహారాష్ట్ర నుండి 'ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి' 18వ విడత నిధులను విడుదల చేశారని సీఎం యోగి పేర్కొన్నారు.

రైతులకు ఆర్థికంగా చేయూత 

రైతులకు ఆర్థికంగా చేయూతనిస్తున్న ఈ సంక్షేమ పథకం 18వ విడతలో భాగంగా 20,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు విడుదలయ్యాయని, దీని ద్వారా యూపీలో 2.25 కోట్ల మందితో పాటు దేశవ్యాప్తంగా 9.4 కోట్ల మంది రైతులు లబ్ధి పొందనున్నారని సీఎం యోగి తెలిపారు.

పవిత్ర శరన్నవరాత్రి పర్వదినం సందర్భంగా రైతులకు ఇంతటి గొప్ప కానుక అందించినందుకు గాను యూపీ రైతుల తరపున ప్రధాని మోడీకి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని సీఎం యోగి పేర్కొన్నారు.

click me!