మన కాలపు దిగ్గజం.. : క్వీన్ ఎలిజబెత్ మరణంపై ప్రధాని మోడీ ట్వీట్

Published : Sep 09, 2022, 12:58 AM IST
మన కాలపు దిగ్గజం.. : క్వీన్ ఎలిజబెత్ మరణంపై ప్రధాని మోడీ ట్వీట్

సారాంశం

బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ 2 మన కాలపు దిగ్గజం అని ప్రధాని మోడీ పేర్కొన్నారు. స్ఫూర్తివంతమైన నాయకత్వాన్ని ఆమె యూకే ప్రజలకు అందించారని తెలిపారు. ఆమె మరణం తనను కలచి వేసిందని, ఈ విషాదకర సమయంలో వారి కుటుంబ సభ్యులు, యూకే ప్రజలకు తన సానుభూతి అని ట్వీట్ చేశారు.   

న్యూఢిల్లీ: బ్రిటన్ క్వీన్ రెండో ఎలిజబెత్ మరణించిన సంగతి తెలిసిందే. క్వీన్ ఎలిజబెత్ 2 మరణంపై ఆమె కుటుంబ సభ్యులకు, యూకే ప్రజలకు భారత ప్రధాని నరేంద్ర మోడీ సానుభూతి ప్రకటించారు. క్వీన్ ఎలిజబెత్ 2 మన కాలపు దిగ్గజంగా నిలిచిపోతారని ట్వీట్ చేశారు. యూకేకు, ఆ దేశ ప్రజలకు స్ఫూర్తివంతమైన నాయకత్వాన్ని అందించారని వివరించారు. ప్రజా జీవితంలో హుందాతనానికి, డీసెన్సీకి ఆమె నిలువెత్తు రూపం అని పేర్కొన్నారు. ఆమె మరణం తనను కలచి వేసిందని వివరించారు. ఈ విషాద సమయంలో ఆమె కుటుంబ సభ్యులకు, యూకే ప్రజలకు తన సానుభూతి అని తెలిపారు.

మరో ట్వీట్‌లో ఆమెను కలుసుకున్న సందర్భాన్ని ప్రధాని మోడీ గుర్తు చేసుకున్నారు. 2015, 2018లో తాను చేసిన యూకే పర్యటనల్లో క్వీన్ ఎలిజబెత్‌ 2ను కలుసుకున్న జ్ఞపకాలు తనకు ఉన్నాయని వివరించారు. ఆమె చూపించిన ఆదరణను తాను ఎప్పుడూ మరిచిపోలేనని తెలిపారు. ఇలా జరిగిన ఒక భేటీలో క్వీన్ ఎలిజబెత్ పెళ్లి చేసుకున్నప్పుడు మహాత్మా గాంధీ గిఫ్ట్‌గా ఇచ్చిన చేతి రుమాలును చూపించారని పేర్కొన్నారు. ఆ అంశాన్ని తాను ఎప్పుడూ తలుచుకుని సంతోషిస్తానని తెలిపారు.

బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ 2 కన్నుమూశారు. కొన్ని వారాలుగా తీవ్ర అనారోగ్యంతో ఉన్న ఆమె తన 96వ యేటా తుది శ్వాస విడిచారు. బ్రిటన్‌ను దీర్ఘకాలం పాలించిన రాణిగా తన పేరును రికార్డుల్లో సుస్థిరం చేసుకున్నారు. 70 ఏళ్లపాటు ఆమె బ్రిటన్‌కు రాణిగా కొనసాగారు.

క్వీన్ ఎలిజబెత్ 2 తన చివరి రోజుల్లో స్కాట్లాండ్‌లోని బాల్మోరల్ రిట్రీట్‌లో గడిపారు. ఆమె అనారోగ్యం దారుణంగా దిగజారడంతో రాజ వంశస్తులు ముందుగానే అక్కడకు చేరుకున్నారు. క్వీన్ ఎలిజబెత్ 2 తనయుడు, ఆమె వారసుడు ప్రిన్స్ చార్లెస్, మనవళ్లు విలియం, హ్యారీలు, ఇతర కుటుంబ సభ్యులు స్కాట్లాండ్ చేరుకున్నారు.

బ్రిటన్ క్వీన్ ఎలిజబెత్ 2 మరణించినట్టు బకింగ్‌హామ్ ప్యాలెస్ ప్రకటించింది. బల్మోరల్ ఎస్టేట్‌లో ఆమె గురువారం మధ్యాహ్నం కన్నుమూసినట్టు వివరించింది. 

ఎలిజబెత్ 2 ఆరోగ్యం మరీ క్షీణిచడంతో వైద్యులు ఆమె ఆరోగ్యాన్ని పర్యవేక్షించారు. వైద్యుల పర్యవేక్షణలో ఉండగా రాజవంశీకులు గురువారం ఆమె తన చివరి రోజులు గడిపిన స్కాట్లాండ్‌కు బయల్దేరి వెళ్లారు. ఆమె మనవడు ప్రిన్స్ విలియమ్, విలియమ్ సోదరుడు హ్యారీలు కూడా అక్కడికి చేరుకున్నారు.

అనారోగ్యం కారణంగా క్వీన్ ఎలిజబెత్ 2 తొలిసారిగా స్కాట్లాండ్‌లో ప్రధానిని నియమించారు. లిజ్ ట్రస్‌ను ఆమె పీఎంగా అపాయింట్ చేశారు. యూకే నూతన ప్రధాని లిజ్ ట్రస్ కూడా క్వీన్ ఎలిజబెత్ 2 మరణంపై స్పందించారు. 

తదుపరి బ్రిటన్ రాజుగా మూడో చార్లెస్ బాధ్యతలు తీసుకుంటారు. కొత్త బ్రిటన్ కింగ్‌కు తాము అన్ని విధాల మద్దతు ఇస్తామని లిజ్ ట్రస్ ప్రకటించారు. కొత్త రాజుగా బాధ్యతలు తీసుకునే చార్లెస్ 3, ఆయన భార్య ఈ రోజు స్కాట్లాండ్‌లోనే ఉండనున్నారు. రేపు లండన్ తిరిగి వెళ్లనున్నారు. తన తల్లి మరణంతో తాను, తన కుటుంబం తీవ్రంగా కలత చెందానని న్యూ కింగ్ చార్లెస్ 3  తెలిపారు.

 

PREV
click me!

Recommended Stories

Prada: ఈ చెప్పుల ధ‌ర అక్ష‌రాల రూ. 85 వేలు.. కొల్హాపురి కళాకారులతో ఇటాలియ‌న్ కంపెనీ ఒప్పందం
అసదుద్దీన్ యాక్టివ్.. మరి మీరేంటి.? తెలంగాణ ఎంపీలపై ప్రధాని మోదీ ఫైర్