తనకు పాఠాలు చెప్పిన ఉపాధ్యాయుడిని కలిసిన ప్రధాని మోడీ.. ఆయన పేరు తెలుసా?

By Mahesh KFirst Published Jun 10, 2022, 6:10 PM IST
Highlights

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తన ఒకరోజు గుజరాత్ పర్యటనలో నవసారి వెళ్లారు. అక్కడ తనకు బాల్యంలో పాఠాలు చెప్పిన గురువు జగదీశ్ నాయక్‌ను కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలోకి ఎక్కింది.
 

అహ్మదాబాద్: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తనకు విద్యా బోధన చేసిన స్కూల్ టీచర్‌ను కలిశారు. గుజరాత్‌లో నవసారిలోని వాడ్‌నగర్‌లో స్కూల్ టీచర్‌ను కలిశారు. ప్రధాని మోడీకి పాఠాలు చెప్పిన ఆ ఉపాధ్యాయుడి పేరు జగదీశ్ నాయక్ అని ఏబీపీ మీడియా సంస్థ ఓ కథనంలో పేర్కొంది. ఇందుకు సంబంధించిన ఫొటో ఒకటి బయటకు వచ్చింది. ఇప్పుడు ఈ ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది.

ప్రధానమంత్రి మోడీ ఎప్పుడు గుజరాత్ పర్యటనలో ఉన్నా ఏదో ఒక కొత్త విషయాన్ని బయటకు తెచ్చి అందరినీ ఆశ్చర్యపరుస్తుంటారు. ఈ సారి ఆయనకు సంబంధించిన ఓ ఫొటో బయటకు వచ్చింది. ఆ ఫొటోలో ప్రధాని మోడీ కలుసుకున్నది తనకు విద్య నేర్పిన స్కూల్ టీచర్ అని మీడియా సంస్థలు పేర్కొన్నాయి. 

ఈ చిత్రం గుజరాత్‌లోని నవసారీలో దిగినదిగా ఏబీపీ లైవ్ సంస్థ పేర్కొంది. ఈ నవసారీలోనే ప్రధాని మోడీ తన బాల్యంలో పాఠశాల విద్యను అభ్యసించాడని వివరించింది. బయటకు వచ్చిన ఆ చిత్రంలో ప్రధాని మోడీ రెండు చేతులు జోడించి గురువుకు ప్రణామం చేస్తున్నట్టు కనిపించారు. కాగా, ఆ రిటైర్డ్(!) స్కూల్ టీచర్ జగదీశ్ నాయక్ ప్రధాని మోడీ తలపై చేయి పెడుతూ ఆయనను ఆశీర్వదిస్తున్నట్టుగా ఉన్నది.

ప్రధాని మోడీ గుజరాత్‌లో ఒక రోజు పర్యటనలో ఉన్నారు. ఇందులో భాగంగా ఆయన నవసారి వెళ్లి తనకు బాల్యంలో చదువు చెప్పిన ఉపాధ్యాయుడిని కలుసుకున్నట్టు ఆ వార్తా సంస్థ వెల్లడించింది. మహాత్మా గాంధీ అభినులు ధరించే టోపీ, తెల్ల బట్టలతో ఆ టీచర్ జగదీశ్ నాయక్ ఉన్నట్టు తెలిసింది. 

click me!