BJP MLA apologises: కూతురు దురుసు ప్రవర్తన.. తండ్రి క్ష‌మాప‌ణ

Published : Jun 10, 2022, 04:33 PM ISTUpdated : Jun 10, 2022, 04:34 PM IST
BJP MLA apologises: కూతురు దురుసు ప్రవర్తన.. తండ్రి క్ష‌మాప‌ణ

సారాంశం

BJP MLA apologises: ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి.. పోలీసులు, మీడియా పై తన కూతురు దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌డం ప‌ట్ల‌ బీజేపీ ఎమ్మెల్యే అరవింద్ లింబావలీ క్షమాపణలు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. త‌న‌  కూతురి ప్రవర్తన వల్ల ఎవరైనా బాధపెట్టి ఉంటే క్షమాపణలు కోరుతున్నానని అన్నారు.  

BJP MLA apologises: ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించి.. పోలీసులు, మీడియా పై తన కూతురు దురుసుగా ప్ర‌వ‌ర్తించ‌డం ప‌ట్ల‌ బీజేపీ ఎమ్మెల్యే క్షమాపణలు చెప్పారు. ట్రాఫిక్ నిబంధ‌న‌లను అతిక్ర‌మిస్తూ.. ర్యాష్ డైవింగ్ చేసిన  బీజేపీ ఎమ్మెల్యే అరవింద్‌ లింబావళి (MLA Aravind Limbavali) కుమార్తెను గురువారం ట్రాఫిక్‌ పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆమె ఆగ్ర‌హానికి లోనైనా ఆమె పోలీసులపై రెచ్చిపోయింది. ఆ స‌మ‌యంలో త‌న నోటికి వ‌చ్చిన‌ట్టు మాట్లాడింది.

అంత‌టితో ఆగ‌కుండా.. ఈ ఘటనను తమ కెమెరాల్లో బంధించిన మీడియా ప్రతినిధి పట్ల కూడా ఆమె దురుసుగా ప్రవర్తించారు. అత‌నిపై దాడికి య‌త్నించింది. ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట్లో వైరల్ గా మారి.. విమ‌ర్శ‌లు వెల్లువెత్తడంతో బీజేప ఎమ్మెల్యే అరవింద్‌ తన కూతురు ప్రవర్తనపట్ల పోలీసులు, జర్నలిస్టులకు క్షమాపణలు చెప్పారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'నా కూతురి ప్రవర్తన వల్ల ఎవరైనా బాధపెట్టి ఉంటే క్షమాపణలు కోరుతున్నాను. నేను వీడియో చూశాను, ఆమె మీడియా నుండి వచ్చిన వారిని 'సార్' అని సంబోధించింది, మీడియాను బాధపెడితే, ఆమె తరపున నేను క్షమాపణలు చెబుతున్నాను, మా కుటుంబానికి మంచి ట్రాక్ రికార్డ్ ఉందని, ఆ ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే  క్షమాపణలు చెప్పారు. బెంగళూరులోని మహదేవపుర నియోజకవర్గం ఎమ్మెల్యే అరవింద్ లింబావలీ. ఆయ‌న‌ BS యడియూరప్ప మంత్రివర్గంలో అటవీ శాఖ సహాయ మంత్రి, కన్నడ సాంస్కృతిక శాఖ మంత్రిగా సేవ‌లందించారు. 

బీజేపీ ఎమ్మెల్యే అరవింద్‌ కూతురు.. బెంగళూరులో గురువారం తన బీఎండబ్ల్యూ కారు నడుపుతూ ట్రాఫిక్ సిగ్నల్‌ను జంప్ చేసింది. దీంతో పోలీసులు ఆమె కారును నిలిపారు. సిగ్నల్‌ క్రాస్‌ చేసినందుకు  జరిమానా విధించారు. దీంతో ఆమె రెచ్చిపోయింది.  నా కారునే ఆపుతారా..? నేనెవ‌రో తెలుసా..?  నేను ఎమ్మెల్యే లింబావళి కూతుర్ని..  అని పోలీసులతో వాగ్వాదానికి దిగింది. ప్రస్తుతం తన వద్ద డబ్బులు లేవని, ఇప్పుడు ఫైన్‌ చెల్లించనని మొండికేసింది.

అయినా..  ట్రాఫిక్ పోలీసులు మాత్రం.. ఎమ్మెల్యే కూతురిని విడిచిపెట్టలేదు. ఆమె న‌డుపుతున్న బీఎండబ్ల్యూ కారుపై  రూ.9000 ల పెండింగ్ చలానాలు ఉన్నట్టు ట్రాఫిక్ పోలీసులు గుర్తించారు. తాజాగా ర్యాష్ డ్రైవింగ్‌తో పాటు సిగ్న‌ల్ జంపింగ్ కు మరో రూ.1,000 ఫైన్ వేసి మొత్తం రూ.10,000 చెల్లించాల‌ని చెప్పారు. కొద్దిసేపు.. వాదించిన ఎమ్మెల్యే కుమార్తె చివరకు .. మొత్తం చ‌లానాల‌ను చెల్లించి అక్కడ నుంచి వెళ్లిపోయినట్టు స‌మాచారం. 

ఈ ఘ‌ట‌న‌పై జనతాదళ్ (సెక్యులర్) స్పందించింది. JDS అధికార ప్రతినిధి తన్వీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడుతూ.. ఈ చర్య సిగ్గుచేటని, ఎమ్మెల్యే కుమార్తె చట్టాన్ని పాటించాల్సిన అవసరం ఉందని అన్నారు.  లా అండ్ ఆర్డర్ నుండి తప్పించుకోవడానికి తన తండ్రి గుర్తింపును ఉపయోగించుకోవ‌డాన్ని తీవ్రంగా త‌ప్పు బ‌ట్టారు. ఇది అరవింద్ లింబావలీ కుమార్తె ప్రశ్న కాదని.  ఇలాంటి ఘ‌ట‌న‌లు దేశ‌వ్యాప్తంగా జ‌రుగుతున్నాయ‌నీ, పిల్ల‌లు మొద‌ట‌ త‌మ‌ తల్లిదండ్రులు ప్రజా సేవకులని తెలుసుకోవాల‌ని,  ఇది ఇబ్బందికరం.. సిగ్గుచేట‌ని విమ‌ర్శించారు. 
 
ఈ ఘ‌ట‌న‌పై కాంగ్రెస్ కూడా స్పందించింది. ఇది బీజేపీ అరాచకాలకు నాంది అని పేర్కొంది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి నిజాం ఫౌజ్దార్ స్పందించారు. రాబోయేవి చెత్త రోజులని హెచ్చరించారు. "ఇది ప్రారంభం మాత్రమే. ఇది బిజెపి అరాచక పాలన. రాష్ట్రంలో అణగారిన వ‌ర్గాల‌పై ఆధిపత్యం చెలాయిస్తుంది. రాబోయే రోజుల్లో మీరు చాలా దారుణమైన రోజులు చూస్తారు. ఆందోళన చెందవద్దని, చట్టం గెలుస్తుంది. ఈ చర్య BJP సంస్కృతిలో అంతర్భాగం. మనం ఎందుకు ఆశ్చర్యపడాలి?" అని ట్వీట్ చేశారు.

PREV
click me!

Recommended Stories

Census 2027 : వచ్చేస్తున్న డిజిటల్ జనాభా లెక్కలు.. పేపర్ లేదు, పెన్ను లేదు.. అంతా యాప్ ద్వారానే !
IndiGo : ఇండిగో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. సీఈఓ పీటర్‌ ఎల్బర్స్‌ క్షమాపణలు.. బిగ్ అప్డేట్ !