మంత్రులతో భేటీ: లాక్‌డౌన్ పై మోడీ నిర్ణయంపై ఉత్కంఠ

By narsimha lode  |  First Published May 1, 2020, 2:21 PM IST

ప్రధానమంత్రి నరేంద్రమోడీ శుక్రవారం నాడు పలువురు మంత్రులతో భేటీ అయ్యారు. లాక్ డౌన్ కు మే 3వ తేదీ వరకే గడువు ఉంది. ఈ తరుణంలో లాక్ డౌన్ ను పొడిగించాలా వద్దా అనే విషయమై మంత్రులతో చర్చిస్తున్నారు ప్రధాని మోడీ.



న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్రమోడీ శుక్రవారం నాడు పలువురు మంత్రులతో భేటీ అయ్యారు. లాక్ డౌన్ కు మే 3వ తేదీ వరకే గడువు ఉంది. ఈ తరుణంలో లాక్ డౌన్ ను పొడిగించాలా వద్దా అనే విషయమై మంత్రులతో చర్చిస్తున్నారు ప్రధాని మోడీ.

హోంమంత్రి అమిత్ షా, రైల్వే మంత్రి పీయూష్ గోయల్, ఏవియేషన్ మంత్రి హరిదీప్ పురి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.గురువారం నాడు ప్రధాని పలువురు మంత్రులతో సమావేశం నిర్వహించారు. ఆర్ధిక పరిస్థితిని మెరుగుపర్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. ఈ సమావేశానికి కొనసాగింపుగానే ఇవాళ మంత్రులతో మోడీ భేటీ కొనసాగుతోంది.

Latest Videos

undefined

లాక్ డౌన్ కొనసాగిస్తే ఆర్ధిక పరిస్థితిపై తీవ్రమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. లాక్ డౌన్ ఎత్తివేస్తే కరోనాను అరికట్టేందుకు ఏ రకమైన చర్యలు తీసుకోవాలనే  విషయమై కూడ ప్రభుత్వం చర్చించనుంది.

విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు స్థానిక పెట్టుబడులను ప్రమోట్ చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో చర్చించినట్టుగా పీఎంఓ ఒ ప్రకటనలో తెలిపింది.

ఇతర రాష్ట్రాల్లో చిక్కుకొన్న వలస కూలీలు, విద్యార్థులను వారి స్వంత రాష్ట్రాలకు తరలించేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది.

also read:ముంబైలో ఫ్లాట్‌లోనే శవమై తేలిన ఎయిర్ హోస్టెస్

తెలంగాణ నుండి జార్ఖండ్ కు వలస కూలీలను తరలించేందుకు రైల్వేశాఖ ప్రత్యేక రైలును ఏర్పాటు చేసింది. వలస కూలీల తరలింపుకు ఏర్పాటు చేసిన తొలి రైలు ఇదేనని రైల్వే శాఖ ప్రకటించింది.ఆంక్షలు ఎత్తివేస్తే డొమెస్టిక్ విమానాలను అనుమతించే అవకాశం లేకపోలేదు. సోషల్ డిస్టెన్సింగ్ ను అనుమతిస్తూనే విమానాల రాకపోకలు కొనసాగించనున్నారు.
 

click me!